తెలంగాణ

హైకోర్టు విభజనపై జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 17: హైకోర్టు విభజన అంశంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదులు కొందరు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారుదత్తాత్రేయను కోరారు. బిజెపి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ రవీంద్ర విశ్వనాథ్ నేతృత్వంలో పలువురు న్యాయవాదులు ఆదివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళు దాటినా హైకోర్టు విభజన జరగకపోవడంతో న్యాయవాదుల్లో ఆందోళన పెరిగిందని వారు కేంద్ర మంత్రికి వివరించారు. పైగా న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయాధికారులను, ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగిందని, ఈ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయించాలని వారు కోరారు. అందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పందిస్తూ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర హైకోర్టు విభజన, కొత్తకోర్టుకు భవన నిర్మాణం తదితర అంశాలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూ చించారు. ఇందుకు అవసరమైన నిర్మాణాలకు కేంద్రం సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో తాను ఇదివరకే కేంద్ర న్యాయ శాఖ మంత్రి, కేంద్ర హోం మంత్రిని కలిసి చర్చించానని దత్తాత్రేయ చెప్పారు.
హైకోర్టు విభజన అంశంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదులు
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం