హైదరాబాద్

ఊపందుకున్న బోనాల ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునేందుకు వీలుగా విస్త్రృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బోనాల ఏర్పాట్లకు సంబంధించి పలు దఫాలుగా మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 24న సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాంకాళీ బోనాల జాతర కారణంగా పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాలకు సోమవారం నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లోని దేవాలయాలకు మరో వారం రోజుల్లో పనులను బట్టి నిధులను మంజూరు చేసే దిశగా కసరత్తు మొదలైంది. కానీ, పూర్తి స్థాయిలో పనులు చేపట్టేందుకు వీలుగా నిధులు అందటం లేదని పలు దేవాలయాల కమిటీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేవాలయాల వద్ద షాబాద్ బండలు వేయటం, మరికొన్ని చోట్ల బిటి రోడ్లు, రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చే పనులకు అధికారులు ప్రతిపాదనలను పరిశీలించి మంజూరి ఇస్తున్నారు. వచ్చే ఆదివారం జరగనున్న సికిందరాబాద్ బోనాల ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించారు. ప్రతి సంవత్సరం ఇదే తరహాలో పనులకు ముందస్తుగా మంజూరీలిచ్చినా, పండుగ రోజున కూడా పలు పనులు జరిగేవన్న విషయాన్ని వివిధ దేవాలయాల కమిటీలు అమాత్యుల దృష్టికి తీసుకురావటంతో ఈసారి ప్రభుత్వం కాస్త ముందుచూపుతో వ్యవహారిస్తోంది. ఉజ్జయినీ మహాంకాళీ దేవాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లోని పనులను కార్పొరేటర్లు పరిశీలిస్తున్నారు. అధికారులను వెంటబెట్టుకుని మరీ పనులు చేయించుకుంటున్నారు. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండకు బోనాలు, తొట్టెల ఊరేగింపులు వచ్చే అవకాశమున్నందున ఆయా మార్గాల్లో రోడ్లు, వీది ధీపాలు వంటివి అధికారులు పరిశీలిస్తున్నారు. ఈనెల 31వ తేదీ పాతబస్తీతో పాటు న్యూసిటీలోని వివిధ ప్రాంతాల్లోనూ బందోబస్తుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నగరంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేసిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు జాతీయ దర్యాప్తు సంస్థకు పట్టుబడిన నేపథ్యంలో ఈసారి బోనాలకు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.