హైదరాబాద్

ఇళ్లపై నుంచి సెల్ టవర్లను తొలగించాలని ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 18: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో ఇళ్లపై ఎక్కడబడితే అక్కడ సెల్ టవర్లు వెలుస్తున్నాయి. అనుమతి లేని బహుళ అంతస్తులపై ఏర్పాటు చేస్తున్న టవర్లు ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పర్యవేక్షణ లోపం పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల అండదండలతో వెలుస్తున్న సెల్ టవర్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ చిల్కానగర్ మల్లిఖార్జున్‌నగర్, రామంతాపూర్ గాంధీనగర్ కాలనీల ప్రజలు సోమవారం సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వందలాది మంది ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి డిప్యూటి కమిషనర్ చాంబర్‌లో బైఠాయింపు జరిపి కమిషనర్ విజయకృష్ణను ఘెరావ్ చేశారు. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు అనుమతి లేని భవనాలపై టవర్లను ఏర్పాటు చేయడం వల్ల వేరియేషన్‌తో గర్భిణీలకు ప్రమాదం, మనుష్యుల్లో శక్తి తగ్గి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు దూరంగా ఉండాల్సిన టవర్లు ఇళ్లపై పెట్టడానికి ఎందుకు అనుమతి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా బహుళ అంతస్తులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ప్రజా వ్యతిరేక కార్యకళాపాలకు పాల్పడినా అధికారులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కార్పొరేటర్ల సహకారంతో వెలుస్తున్న సెల్ టవర్లను తొలగించి అనుమతి లేని భవనాలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేపట్టిన కాలనీల ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, బిజెపి, సిపిఎం నేతలు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సంబధిత సెల్ టవర్ల భవన యజమానులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగం ఏసిపి నాగిరెడ్డిని డిప్యూటి కమిషనర్ ఆదేశించారు.