హైదరాబాద్

అలరించిన గురుపౌర్ణమి నృత్యోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: శ్రీకృష్ణ నాట్యమండలి ఆధ్వర్యంలో మంగళవారం నటరాజ కళా మందిరంలో గురువులకు నృత్య నీరాజనం జరిగింది. తొలుత నృత్యం నేర్చుకుంటున్న ఔత్సాహిక కళాకారులు నటరాజ స్వామికి పుష్మాంజలి సమర్పించి నాట్యాచార్యులకు పాదపూజ చేసి గురు సత్కారం చేశారు. నృత్య కార్యక్రమంలో కేరళకు చెందిన గురువయ్యారు నాట్యమండలి ‘శ్రీకృష్ణ లీలామృతం’ నృత్య నాటిక సమర్పించారు. బాలగోపాలుని చిలిపి చేష్టలు, యమునా తీరాన గోపికలతో సరస శృంగార నృత్యంతో పాటు రుక్మిణీ కల్యాణం కూడా ప్రదర్శించారు. నాట్యాచార్యులు మణికంఠేశ్వరాచార్యులు నేతృత్వంలో సుగణకుమారి, సుహాసిని, రాధాకుమారి, లక్ష్మీబాయి, మెరీనా పాల్గొన్నారు. అనంతరం నాట్యాచారిణి సుజనా చక్రవర్తి ఆధ్వర్యంలో ‘నరకాసుర సంహారం’ కథాకేళి నృత్యశైలిలో ప్రదర్శించిన నృత్యాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రౌద్ర, భయానక, బీభత్స రూపాలతో పెద్దపెద్ద అడుగులతో వేదికపై చిందులు వేస్తూంటే ప్రత్యేకంగా అలంకరించిన విద్యుదీపాలకు తాండవ నృత్యం రక్తికట్టింది. నరకాసురుడు చేతిలో కత్తి తిప్పుడూ కృష్ణుడితో కలయబడటం హృద్యంగా సాగింది. ఈ అంశంలో నరకాసురిడిగా విజయనారాయం, కృష్ణుడిగా చిదంబరం తదితరులు నర్తించారు. మూడు గంటలపాటు సాగిన ఈ ప్రధాన అంశం కనువిందు చేసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న విశ్రాంత ఐఎఎస్ అధికారి చంద్రశేఖర్‌రావు.. కళాకారులను సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. శ్రీకృష్ణ నాట్యమండలి ఆధ్వర్యంలో నడుపుతున్న సంగీత నృత్య కళాశాల విద్యార్థులు విద్యార్థినులకు సంస్థ పక్షాన వస్త్రాలు ప్రదానం చేశారు.