హైదరాబాద్

విభజన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 19: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని ఏపి ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, రామకృష్ణ, శివాజీ, శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిపత్తితోనే ఏపి అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడతాయన్నారు. చంద్రబాబు ఎన్నిదేశాలు తిరిగి అర్ధించినా ఎవరూ వచ్చి ఏపిలో పరిశ్రమలు స్థాపించరని, ప్రత్యేక ప్రతిపత్తితోనే సాధ్యవౌతుందన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేవిపి రామచంద్ర రావు ప్రవేశపెట్టనున్న బిల్లుకు అంతా మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన నేతలు దక్షణభారతానికి చెందిన రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఏపి సిఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రత్యేకపత్తి కాకుండా ప్యాకేజీకి సరేనంటే చంద్రబాబు ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని నటుడు శివాజీ హెచ్చరించారు. రాజకీయ ముసుగులో సంపాదించిన సొమ్ము చాలు ఇకనైనా ప్రజలకు మేలుచేసే విషయంపై దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని, ఇందులో భాగంగా ఈనెల 27న విజయవాడలో విద్యార్థి గర్జన నిర్వహించనున్నట్టు చెప్పారు.