హైదరాబాద్

నాటి నాటీ కిడ్.. నేడు మిస్టర్ వరల్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, జూలై 21: అమృతం తాగేవారు దేవతలు, దేవుళ్లు..అది కన్నబిడ్డలకు పంచేవారు అమ్మానాన్నలు అని తల్లిదండ్రులను వర్ణించాడు ఓ సినీ గేయరచయిత. పిల్లల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దపడే తల్లిదండ్రుల మాట పిల్లలు వినకుండా, వారు సూచించిన బాటను అనుసరించపోతే ఎంతటి సహనమూర్తులైన కొన్ని సందర్భాల్లో అసహనానికి గురవుతుంటారు. కానీ ‘మిస్టర్ వరల్డ్’ రోహిత్ తనకు తెలివి వచ్చిన నాటి నుంచే తల్లిదండ్రుల మాట వినకపోయినా, వారు చూపిన మార్గంలో నడవకపోయినా వారికే అతనిపై ఏనాడూ కోపం రాలేదు. అందుకు వారి సహనం ఒక కారణమైతే..వారిని కన్విన్స్ చేయటం రోహిత్ టాలెంట్. అంతేగాక, ఇంట్లో తాను డాన్స్ చేస్తున్నపుడు, మోడలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నపుడు అడ్డుపడే కుటుంబ సభ్యులను డాన్స్ చేస్తూనే నవ్వించేవాడని, చెప్పే అభ్యంతరం సైతం నవ్వుతూ చెప్పాలనే వ్యక్తితత్వం రోహిత్‌ది. మోడలింగ్, డాన్సులు చేయటం మనలాంటి సంప్రదాయకుటుంబాలకు తగదని ఎన్ని సార్లు తల్లిదండ్రులు నచ్చజెప్పినా, ఏదో ఒక రోజు మీరే ఆశ్చర్యపోతారు..మొత్తం ప్రపంచం నన్ను గుర్తిస్తుందన్న ధైర్యంతో రోహిత్ ఉండేవాడని నగరంలోని బడీచౌడిలోని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్‌గా ఎంపికైన తర్వాత ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. చార్మినార్ చేలాపూర్‌లో జన్మించిన రోహిత్ ఆ తర్వాత బడీచౌడీకి ఇళ్లు మార్చారు. అతనికి చిన్ననాటి నుంచి రోహిత్ రాయ్, రాఖేశ్, రేఫే అనే ముగ్గురు స్నేహితులుండేవారు. తాను ఎంచుకున్న మార్గంలో ముందుకెళ్లేందుకు కుటుంబ సహకారం లేకపోవటంతో అపుడపుడు స్నేహితుల సలహాలు తీసుకునే వాడు. ఈ ముగ్గురు స్నేహితుల్లో కేవలం రోహిత్ రాయ్ మాత్రమే నగరంలో వ్యాపారవేత్తగా స్థిరపడగా, రేఫే దుబాయ్‌లో ఉండగా, రాకేశ్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. నెలరోజుల క్రితం ముంబై వెళ్లిన రోహిత్ ఇపుడు మిస్టర్ వరల్డ్‌గా ఇంటికి తిరిగిరానున్నారు. భవిష్యత్తులో ఎలా ఉండాలన్నది రోహిత్ నిర్ణయించుకోవచ్చునని తెలిపిన తల్లి మరి రోహిత్‌ను ఒకింటివాడిని చేసేందుకు మిస్ వరల్డ్‌ను వెతికిపెట్టారా? అన్న ప్రశ్నకు తల్లి సుమలత, వదిన షీతల్ ఖండేల్వాల్‌లు సమాధానాన్ని నవ్వుకే పరిమితం చేశారు.