హైదరాబాద్

బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూలై 22: సికింద్రాబాద్ నియోజకవర్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బోనాల ఉత్సవాలు నిర్వహించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి టి.పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 31న సికింద్రాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించబోయే బోనాల ఉత్సవాలకు అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా మంచినీటి సరఫరాతోపాటు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని, రెండు లక్షల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. రోడ్లు, విద్యుత్ దీపాలతోపాటు పారిశుద్ధ్య నిర్వహణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌దీపాలు లోపాలు లేకుండా చూడడంతోపాటు మొబైల్ ట్రాన్స్‌పార్మర్‌లను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొంతమంది అధికారులు సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు తమ పద్ధతిని మార్చుకోవాలని సున్నితంగా మందలించారు. ఇక నియోజకవర్గంలోని అన్ని అమ్మవారి ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని, చిన్న చిన్న గుడుల వద్దకూడ భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు. దరఖాస్తు చేసుకున్న అన్ని దేవాలయాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, నిధులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. కట్టమైసమ్మ దేవాలయానికి గత యేడాది రు.5లక్షలు మంజూరు చేయడం జరిగిందని, వాటి లెక్కలు ఇప్పటికి వివరించలేదని, అయినప్పటికి ఈ యేడాది కూడ రు.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు అవసరమైతే ఇంకా ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి బరోసా ఇచ్చారు. డిజెకు అనుమతులు లేవని, సౌండ్‌బాక్స్‌లతోనే సరిపెట్టుకోవాలని తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బోనాల ఉత్సవాలను అత్యంత వేడుకగా భక్తిశ్రద్దలతో నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్ విజయరాజు, డిసిపి సుమతి, కార్పోరేటర్‌లు సరస్వతి, హేమ, ధనంజనగౌడ్ తదితరులు పాల్గొన్నారు.