హైదరాబాద్

‘ఫ్లెక్సీ’ ఫైర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: మహానగరంలో తాజాగా ఫ్లెక్సీ, బ్యానర్ల తొలగింపుపై రగడ ప్రారంభమైంది. నగరంలో అభివృద్ధి, వౌలిక వసతుల కల్పన, ప్రమాదాల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణ వంటి అంశాలకు సంబంధించి న్యాయస్థానం, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఆదేశాలు జారీ చేసినా, వాటిని అమలు పకడ్బందీగా అమలు చేయటంలో విఫలమైన జిహెచ్‌ఎంసి అధికారులు తీరా బోనాల పండుగ జరుగుతున్న సమయంలో వాటిని తొలగించటం పట్ల పేద, మధ్య తరగతి ప్రజలెక్కువగా నివసించే మాస్ ప్రాంతాలైన బస్తీల్లో ఒకింత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సేవ్ ఫ్లేక్సీ ఇండ్రస్టీ అంటూ ఫ్లెక్సీ తయారీ, ప్రింటింగ్ సంస్థల యజమానులు శనివారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. లక్షలాది రూపాయలు వెచ్చించిన తాము తమకు స్వయం ఉపాధిని కల్పించుకోవటంతో పాటు ఇతర నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడించారు.
ఫ్లెక్సీల ముద్రణ, తయారీకి సంబంధించి ప్రత్యేక గైడ్‌లైన్స్‌ను తయారు చేసే అమలు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని వారు వెల్లడించారు. లక్షల రూపాయలు వెచ్చించి యంత్రాలను కొనుగోలు చేశామని, అసలే ముద్రించరాదన్న నిబంధనను పెట్టడటం సబబు కాదని ఫ్లెక్సీ సంస్థల నిర్వాహకులు వాపోతున్నారు. ముఖ్యంగా మాస్ ప్రజలు జరుపుకునే బోనాల పండుగలో ఇంటింటికి వేప కొమ్మలు కన్పించిన విధంగానే గల్లీగల్లీల్లోనూ అమాత్యులు, రాజకీయ నేతలకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా దర్శనమిస్తుంటాయి. ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్టమ్రున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సైతం తమ ఫొటోలున్న ఫ్లెక్సీలను సైతం నిర్ధాక్షిణంగా తొలగించాల్సిందేనని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా, సికిందరాబాద్ బోనాల సందర్భంగా లష్కర్ పరిసర ప్రాంతాల్లో, మెయిన్ రోడ్లలో ఏకంగా మంత్రులు, వారి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులెందుకు తొలగించటం లేదని బస్తీవాసులు వాపోతున్నారు. కోర్టు ఆదేశాలంటూ పిచ్చుకలపై బ్రహ్మస్త్రాలు ప్రయోగించి తమ ప్రతాపాన్ని చాటుకుంటున్న అధికారులు మంత్రులు, సాధారణ ప్రజలకు సైతం ఒకే రకంగా ఆదేశాలను అమలు చేయాలని కోరుతున్నారు.