హైదరాబాద్

నేడు లష్కర్ బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, జూలై 23: ఆషాఢ బోనాల జాతరలో భాగంగా నేటి నుంచి సికిందరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల జాతర జరగనుంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలను ముచ్చటగా ముస్తాబు చేశారు. లష్కర్ పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి. ఇద్దరు మంత్రులు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్ అనుచురులు పోటీపడి మరీ ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు లష్కర్‌లోని అన్ని దేవాలయాల వద్ధ వౌలిక వసతులను ఏర్పాటు చేశారు. నగరంలో భారీ విధ్వంసానికి కుట్ర చేసిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు జాతీయ దర్యాప్తు సంస్థకు పట్టుబడిన నేపథ్యంలో ఈ సారి బోనాల బందోబస్తుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 3వేల మంది పోలీసులతో గట్టి భద్రతను చేపట్టారు. అంతేగాక, అడుగడుగున సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగను స్వరాష్ట్రం, స్వపరిపాలనలో రాష్ట్ర పండుగగా ముచ్చటగా మూడోసారి జరుపుకుంటున్న ఈ జాతరకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 14 నుంచి 15లక్షల మంది హజరయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంఛనా.ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఉజ్జయిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినానంతరం బోనాల సమర్పణ, దర్శనార్థం భక్తులను అనుమతించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఆదివారం శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకునే అవకాశముంది. గత సంవత్సరం రికార్డు స్థాయిలో భక్తులు హాజరుకావటంతో సామాన్య భక్తులకు కాస్త ఇబ్బందులు ఎదురైన ఘటనను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ సారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక, మహాంకాళీ అమ్మవారి ఆలయం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా మద్యం షాపుల మూసివేత వంటి చర్యలు చేపట్టారు. దీనికి తోడు ఇటు బాటా, ప్యాట్నీ చౌరస్తా, రాంగోపాల్‌పేట, బోట్స్‌క్లబ్ చౌరస్తాల మీదుగా మొత్తం దేవాలయ ఆవరణను పోలీసులు శనివారం రాత్రి నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సికిందరాబాద్ బోనాలను పురస్కరించుకుని తేదీ ఆదివారం ఉదయం నుంచి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇందులో భాంగా టోబాకోబజార్ హిల్ వీధి, జనరల్ బజార్ నుంచి మహంకాళీ దేవాలయం వైపు వెళ్లే దారిలో అన్నిరకాల వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు. ఆలగే బాటా క్రాస్‌రోడ్డు నుంచి సుభాష్‌రోడ్డు నుంచి రాంగోపాల్ పేట పోలీస్‌స్టేషన్ వరకు, ఆలాగే అడవయ్య క్రాస్‌రోడ్డు నుంచి మహంకాళీ వైపు దారిలో, జనరల్ బజార్ నుంచి దేవాలయంవైపు వచ్చే రహదారుల్లో కూడా వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు.
మళ్లింపులు..!
రాణిగంజ్ క్రాస్‌రోడ్డు నుంచి సికిందరాబాద్ వైపువచ్చే వాహనాలను కర్బాలా మైదానం వద్ధ మినిష్టర్‌రోడ్డు, రసూల్‌పురా క్రాస్‌రోడ్డు వరకు అక్కడి నుంచి కుడిచేతి వైపు అనుమతించి సిటివోరోడ్డు మీదుగా వైఎంసిఏ క్రాస్‌రోడ్డు, సెయింట్ జోన్ రోటరీ మీదుగా రైల్వే స్టేషన్‌వైపు మళ్లించనున్నారు. అలాగే స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలు కూడా అల్ఫా హోటల్ క్రాస్‌రోడ్డు, గాంధీ క్రాస్‌రోడ్డు, సజ్జన్‌లాల్ స్ట్రీట్, ఓల్డ్ మహంకాళీ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, ఘాన్స్‌మండి, బైబిల్ హౌజ్, కర్బాలమైదాన మీదుగా మళ్లించనున్నారు. అలాగే బైబిల్ హౌజ్ నుంచి ఘాన్స్‌మండి క్రాస్‌రోడ్డువైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాన్స్‌మండి చౌరస్తాల్లో సజ్జన్‌లాల్ వీధి మీదుగా మళ్లించనున్నారు. అలాగే ఎస్‌బిహెచ్ క్రాస్‌రోడ్డు మీదుగా రాష్టప్రతి రోడ్డు వైపు వచ్చే వాహనాలను ప్యాట్నీ క్రాస్‌రోడ్డులో మళ్లించనున్నారు. అలాగే ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్డువైపు వచ్చే వాహనాలను ఎస్‌బిహెచ్ చౌరస్తా, క్లాక్ టవర్ల వద్ద, క్లాక్ టవర్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వచ్చే వాహనాలను ప్యాట్నీ చౌరస్తా మీదుగా ప్యారడైజ్ వైపు మళ్లించనున్నారు. దీంతో పాటు ప్యారడైజ్ చౌరస్తాలో కూడా సిటివో జంక్షన్ నుంచి ఎంజి రోడ్డువైపు వచ్చే వాహనాలను ప్యారడైజ్ చౌరస్తావద్ద మళ్లించనున్నారు.