హైదరాబాద్

తీవ్రమవుతున్న నీటి సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, జనవరి 6: మహానగరంలో మున్ముందు తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చనుంది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా జలాలతో కొన్ని ప్రాంతాలకు ఊరట కల్గుతున్నా, శివార్లకు నీటి సమస్య తప్పటం లేదు. వేసవి కాలంలో కోర్ సిటీలోనూ నీటి సమస్య తీవ్రం కానుంది. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు ప్రాంతాల్లో కొంతవరకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నా, పూర్తి స్థాయిలో ప్రజల అవసరాలు తీర్చటం లేదు. మల్కాజ్‌గిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ ప్రాంతాలకు నీటి తిప్పలు తప్పటం లేదు. మూడు నుంచి నాలుగురోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం శివార్లలో పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరాను సమకూర్చేందుకు మూడు ప్యాకేజీల కింద రూ. 1900 కోట్లతో పనులు చేపట్టనుంది. ఈ పనులు పూర్తయితే తప్ప, శివార్ల నీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు. జంటనగర ప్రజల దాహర్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో రోజురోజుకి నీటి మట్టాలు పడిపోతున్నాయి. ఉస్మాన్‌సాగర్ నుంచి మామూలు రోజుల్లో 25 ఎంజిడిల నీటిని సరఫరా చేసేవారు, కానీ ప్రస్తుతం నీరు లేకపోవటంతో కేవలం 5 ఎంజిడిలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. అదే విధంగా హిమాయత్‌సాగర్ నుంచి మామూలు రోజుల్లో 15 ఎంజిడిల నీరు సరఫరా చేయాల్సి ఉండగా, అదీ 5 ఎంజిడిలకు తగ్గింది. అయితే గోదావరి జలాలు నగరానికి రావటంతో సింగూర్, మంజీరాల నుంచి నగరానికొచ్చే 120 ఎంజిడిల నీటి సరఫరా నిల్చిపోయింది. ఈ మొత్తం నష్టాన్ని గోదావరి జలాలతో పూరించాలని భావించినా, పెద్దగా ఫలితం దక్కటం లేదు. ప్రస్తుతం కృష్ణా మూడు దశల కింద 270 ఎంజిడిలు, గోదావరి నుంచి 84 ఎంజిడిల నీటిని కలుపుకుని నగరానికి మొత్తం 364 ఎంజిడిల నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ప్రతి రోజు గ్రేటర్ ప్రజల అవసరాలు తీర్చేందుకు జనాభా లెక్కల ప్రకారం 610 ఎంజిడిల నీరు అవసరం కాగా, ఇందులో సుమారు అరవై శాతం మాత్రమే సరఫరా జరుగుతోంది. గోదావరి జలాలు పూర్తి స్థాయిలో నగరానికి తీసుకువస్తేనే ఈ దాహార్తిని తీర్చే అవకాశముంటుంది.
జోరుగా కొనసాగున్న నీటి దందా!
సిటీలో నీటి ఎద్దడి సమస్యను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా నీటి దందాను కొనసాగిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎక్కడబడితే అక్కడ ఇష్టారాజ్యంగా బోర్లు వేసి, తూతుమంత్రంగా నీటిని శుద్ధి చేసి బోర్ నీటినే మినరల్ వాటర్‌గా నమ్మిస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. జిహెచ్‌ఎంసిలో విలీనమైన పనె్నండు మున్సిపాల్టీల్లో రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి బల్క్ వాటర్ ద్వారా సప్లై చేసేది. ఇపుడు నీటి కొరత కారణంగా సక్రమంగా సరఫరా లేకపోవటంతో నీటి వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాంతాలనే టార్గెట్ చేసుకుని మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రజల దాహమే వీటి దందాకు పెట్టుబడి అని చెప్పవచ్చు. గతంలో కేవలం రూ. 5 నుంచి రూ. 10మధ్య విక్రయించే మినరల్ వాటర్ క్యాన్‌ను ఇపుడు ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 30 నుంచి 40 వరకు అమ్ముతున్నారు.
రిజర్వాయర్లలో నీటి మట్టాలు(టిఎంసిల్లో)
రిజర్వాయర్ గత.సం.నీ.మట్టం ప్రస్తుతం
ఉస్మాన్‌సాగర్ 0.483 0.033
హిమాయత్‌సాగర్ 1.236 0.202
సింగూరు 9.986 0.823
మంజీరా 0.496 0.000
అక్కంపల్లి 1.319 1.072
నాగార్జునసాగర్ 206.480 28.630
శ్రీశైలం 74.970 51.590