హైదరాబాద్

ఏజెన్సీ ప్రాంతాలను నాలుగు జిల్లాలుగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలోని 5వ షెడ్యూల్ భూభాగాన్ని (ఏజెన్సీప్రాంతాలను) నాలుగు జిల్లాలుగా ప్రకటించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో పోడు భూములను లాక్కోవడాన్ని, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన 48 గంటల మహాధర్నా మంగళవారంతో ముగిసింది.
తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ సభాధ్యక్షతన జరిగిన మహాధర్నాకు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ విమలక్క, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రమేష్‌కుమార్ మాదిగ, మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు, లోక్‌సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు, టిపిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. తుడుందెబ్బ ప్రతినిధులకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. హారితహారం పేరిట ఆదివాసుల పోడుభూముల్ని లాక్కోవడాన్ని నిలిపివేయాలని, ఆదివాసులపై ఫారెస్టు ఆధికార్లు, పోలీసుల దాడులు ఆపివేయాలని డిమాండ్ చేశారు.
వట్టం ఉపేందర్ మాట్లాడుతూ ఉట్నూరు కేంద్రంగా కొమరం జిల్లా, ములుగు కేంద్రంగా సమ్మక్క-సారలమ్మ జిల్లా, భద్రాచలం కేంద్రంగా సోయంగంగులు జిల్లా, ఇల్లందు కేంద్రంగా ఆదివాసి జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు.