హైదరాబాద్

‘కలాం’ అవార్డుకు ఎంపికైన నగర వైద్యుడు డా. చంద్రకాంత్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: మీడియా కౌన్సిల్ ఫర్ పీస్ అండ్ సాలిడారిటీ ఆఫ్ ఇండియా ప్రధానం చేసే ప్రతిష్ఠాత్మకమైన అబ్దుల్ కలాం నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ అవార్డు నగరానికి చెందిన డా.చంద్రకాంత్‌రావును వరించింది. పొగాకు వల్ల వచ్చే జబ్బుల నియంత్రణ, అనర్దాలపై గత రెండు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు మంగళవారం ఆయన మీడియాతో చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన్ను పలువురు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పురస్కారానికి తనను ఎంపిక చేయటం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దివంగత రాష్టప్రతి అబ్దుల్ కలాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సొసైటీ ఫర్ క్యాన్సర్ ఇన్ ఓరల్ కేవిటీ ప్రివెన్షన్ త్రూ ఎడ్యుకేషన్(స్కోప్)సంస్థ ఆధ్వర్యంలో తాము చేపట్టిన పొగాకు వ్యతిరేక ప్రచారానికి మొదటి సంతకం పెట్టింది అబ్దుల్ కలాం యేనని ఆయన గుర్తుచేశారు. ఆయన పేరిట నెలకొల్పిన అవార్డు తనకు దక్కటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
పొగాకు ఉత్పత్తులైన గుట్కా, సిగరెట్, పాన్ మసాల, జర్దా, కిల్లీ, ఖైనీ, బీడి, తంబాకు తదితర వాటి వల్ల ప్రజలు ముఖ్యంగా నోటి క్యాన్సర్‌కు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల్లో ముఖ్యంగా గిరిజనులు, పేదవారే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిపారు. తాను ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డెంటల్ కౌన్సిల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ల సహకారంతో అవగాహన సదస్సులు, పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీల ద్వారా ప్రచారం వంటివి నిర్వహించినట్లు డా.చంద్రకాంత్‌రావు తెలిపారు.