హైదరాబాద్

వీధి దీపాల నిర్వహణలో రూ. 1.47 కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: జిహెచ్‌ఎంసి వివిధ పౌరసేవల నిర్వహణకు చేస్తున్న వ్యయాన్ని ఆదా చేసేందుకు అధికారులు ప్రవేశపెడుతున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో 57 ప్యాకేజీల్లో సుమారు నాలుగు లక్షల 5వేల వీది ధీపాలకు 24వేల స్విచ్‌లున్నాయి. వీటి నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు గత కొద్ది సంవత్సరాలుగా జిహెచ్‌ఎంసి చేస్తున్న కృషి దశల వారీగా ఫలిస్తోంది. తొలుత వీది ధీపాలకు కరెంటు వినియోగాన్ని తగ్గించుకునేందుకు టైమర్లను అమర్చటం, ఆ తర్వాత తక్కువ కరెంటు వినియోగంతో ఎక్కువ వెలుగునిచ్చే ఎల్‌ఇడిలను వినియోగించటం వంటి చర్యలు చేపట్టడటంతో ఈ ఏటా మార్చి నుంచి మే నెలాఖరు వరకు సుమారు 22.90లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గి, జిహెచ్‌ఎంసికి రూ. 1.47 కోట్ల వరకు నిధులు ఆదా అయ్యాయి.
నిరంతర పర్యవేక్షణ, ఎనర్జీ వాలంటీర్ల నియామకం, పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్ల ఏర్పాటు, స్విచ్‌లకు ఆటో టైంలను ఏర్పాటు చేసిన రాత్రి పదకొండు గంటల తర్వాత హైమాస్ లైట్లను ఆపివేయటం తదితర చర్యల వల్ల జిహెచ్‌ఎంసి రూ. కోటి 46లక్షల 62వేలను ఆదా చేసుకుంది.
ప్రస్తుతం 4లక్షల 5వేల వీది ధీపాలకున్న 24వేల స్విచ్‌లకు అదనంగా మరో 2670 టైమర్ల ద్వారా నిర్వహణ చేపట్టింది. గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అమలు చేసిన ‘పరిచయం’ కార్యక్రమాన్ని ఇందులో కూడా అమలు చేస్తూ స్థానికులను ‘ఎనర్జీ వాలంటీర్లు’గా నియమించారు. అనేక ప్రాంతాల్లో సాయంత్రం చీకటి పడకుండానే వీది ధీపాలు వెలుగుతున్నాయని, ఉదయం సకాలంలో వీటిని ఆఫ్ చేయటం లేదని ఫిర్యాదులు అందటంతో జిహెచ్‌ఎంసి వీది ధీపాల ఎనర్జీ విభాగంలో పలు సంస్కరణలను తీసుకురావటంతో విద్యుత్‌తో పాటు జిహెచ్‌ఎంసి నిధులు కూడా భారీగా ఆదా అవుతున్నాయి. గత సంవత్సరం మార్చి మాసంలో 2కోట్ల 3లక్షల 8వేల 645 యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, ఇదే సంవత్సరం మార్చిలో మాసంలో కోటి 97లక్షల 86వేల 445 యూనిట్లకు తగ్గించగలిగారు. అంటే 5లక్షల 22వేల యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గి, రూ. 34లక్షల 98వేల ఆదా అయ్యాయి. అదే గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో 2 కోట్ల 2లక్షక్షల 26వేల 312 యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, దీన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం కల్లా కోటి 93లక్షల 20వేల 691 యూనిట్లకు పరిమితం చేయగలిగారు. గత సంవత్సరంతో పోల్చితే 9లక్షల 5వేల 621 యూనిట్ల విద్యుత్ ఆదా అయి రూ. 60లక్షల 67వేల నిధులు మిగిలిపోయాయి. గత సంవత్సరం మే మాసంలో కోటి 98లక్షల 4వేల 131 యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఈ ఏటా మే మాసంలో కోటి 90లక్షల 43వేల 322 యూనిట్లకు పరిమితం చేసి 7లక్షల 60వేల 809 యూనిట్లను ఆదా చేసి రూ. 50.97లక్షల వ్యయాన్ని తగ్గించగలిగారు.
కొత్తగా ప్రవేశపెట్టిన చర్యలివి
* తెలంగాణ దక్షిణ మండలం విద్యుత్ సరఫరా కార్పొరేషన్ ఇంజనీర్లతో ప్రతి 15రోజులకోసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి డిఫెక్టివ్ మీటర్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేశారు.
* మీటర్లు అందుబాటులో లేని చోట ఆయా విద్యుత్ స్తంభాల ద్వారా సరఫరా అవుతున్న విద్యుత్ లోడ్ ఆధారంగా ఛార్జీల చెల్లింపు.
* సూర్యాస్తమయం, సూర్యోదయంలను అనుసరించి వీది ధీపాలను క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా టైమింగ్ నిర్ణయించటం చేపట్టారు.
* రాత్రి పదకొండు గంటల తర్వాత ఎక్కువ విద్యుత్ వినియోగం అవసరమయ్యే హైమాస్‌లైట్లను ఆర్పివేస్తున్నారు.
* విద్యుత్ వినియోగ దుబారాను అరికట్టడానికి విద్యుత్ దీపాల నిర్వహణలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసొసియేషన్లు, బస్తీ కమిటీల సభ్యులను ఎనర్జీ వాలంటీర్లుగా నియమించారు.
* ఎనర్జీ వాలంటీర్లు సాయంత్రం సరైన సమయంలో వీది ధీపాలు వెలిగించటంతో పాటు ఉదయం తగు సమయంలో ఆర్పివేయట వల్ల అనవసర విద్యుత్ వినియోగం తగ్గింది.
* వీది ధీపాల నిర్వహణలో విద్యుత్ విభాగం సీనియర్ ఇంజనీర్లతో పాటు డిప్యూటీ, జోనల్ కమిషనర్లచే పర్యవేక్షణను పెంచారు.
* ప్రతి సర్కిల్‌కు నియమించిన సూపర్‌వైజరీ అధికారులు క్షేత్ర పర్యటనకు వెళ్లినపుడు విధిగా వీది ధీపాల నిర్వహణపై తనిఖీలు నిర్వహించాలి.
* మున్ముందు విద్యుత్, నిధులను మరింత ఆదా చేసేందుకు ఎల్‌ఇడి లైట్లను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.