హైదరాబాద్

29న అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాల ముందు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 26: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 29న అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు జాతీయ మాలల ఐక్య వేదిక ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఐక్యవేదిక నాయకులు ఆవుల బాలనాథం, సత్యనారాయణ, బాలకిషన్ మాట్లాడుతూ అగ్రకులాలే వర్గీకరణ చిచ్చు రాజేశాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అతితక్కువ శాతం ఉన్న కులాలు అధిక జనాభా కలిగిన వారిని పాలిస్తూ ఆయా కులాల మధ్య అగ్గిరాజేస్తున్నారని దుయ్యబట్టారు. చుండూరు, కారంచేడు వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మాలమాదిగలు ఏకమై పోరాడారని గుర్తుచేశారు. ఈ తరహా ఐక్యత వస్తే తాము రాజ్యాధికారానికి దూరమైపోతామనే కుట్రచేసి మాదిగలను రెచ్చగొట్టారని ఆరోపించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ వద్దంటూ తీర్పు ఇచ్చినా ముఖ్యమంత్రి కేసిఆర్ వర్గీకరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. ఈ తరహా వ్యవహరించినందుకు కేసిఆర్ ప్రభుత్వాన్ని బర్త్ఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాలలు తీవ్ర వివక్షకు గురౌతున్నారన్నారు. తమ బాధలను సిఎం కేసిఆర్‌కు చెప్పుకునేందుకు ఎన్నిసార్లు యత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు. రాజకీయ పార్టీల కుట్రలను ఎండగట్టేందుకే ఈనెల 29న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించి అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల ముందు భారీ ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో ఐక్య వేదిక నేతలు రంగా, శ్రీనివాస్, సుబ్బారాయుడు, శివ పాల్గొన్నారు.