హైదరాబాద్

సంక్రాంతికి 5168 అదనపు బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాదర్‌ఘాట్, జనవరి 6: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8 నుండి 14 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం టి.యస్.ఆర్.టి.సి. ఇరు రాష్ట్రాలకు 5168 అదనపు బస్సులను నడిపించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ బస్సులు జంట నగరాల నుండి వివిధ ప్రాంతాలకు నడుపబడునున్నట్లు హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.నాగరాజు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం మహాత్మాగాంధి బస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంక్రాంతి అదనపు బస్సుల సమాచారాన్ని వివరించారు.
ప్రత్యేక బస్సులను సమర్ధవంతంగా నడిపించుటకు ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎంజిబియస్, జూబ్లీబస్‌స్టేషన్, గౌలిగూడలోని సిబిఎస్ పాత బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్‌తోపాటు నగరంలోని వివిధ శివారు కాలనీలలో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుండి అధీకృత టికెటు బుకింగ్ ఏజెంట్ల వద్ద నుండి కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
పండుగ రద్దీ రోజులలో వివిధ ప్రాంతాల నుండి యంజిబిఎస్‌కు వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడానికి, ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్ వలన అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పండుగ ప్రత్యేక బస్సులలో 50 శాతం టికెట్ చార్జీలను అదనంగా ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 2470 అదనపు బస్సులను నడుపనున్నట్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు 2698 బస్సులను అదనంగా నడుపనున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడంలో భాగంగా ఈ నెల 9 నుండి 13 వరకు వివిధ రూట్లలో చేయబడిన మార్పులు:
* ఖమ్మం, మహబూబ్‌నగర్, పరిగి, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, సంగారెడ్డి వైపు వెళ్ళు షెడ్యూలు, స్పెషల్ బస్సులు యంజిబియస్ నుండే రాకపోకలు సాగిస్తాయి.
* వెనె్నల గరుడ ప్లస్, గరుడ, అంతర్ రాష్ట్ర షెడ్యూలు, స్పెషల్ సర్వీసులు ఎంజిబియస్ నుండి నడుపబడును.
* కర్ణాటక, మహారాష్ట్ర ఆర్టీసి బస్సులు విజయవాడ, గుంటూరుకు సుమారు 140 వరకు షెడ్యూలు బస్సులు ఎంజిబియస్ నుండి నుడపబడును.
* విజయవాడ, గుంటూరు స్పెషల్ సర్వీసులు మరియు 150 వరకు షెడ్యూలు బస్సులు ఎల్బీనగర్ నుండి నడుపబడును.
* కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు వెళ్ళు షెడ్యూలు, స్పెషల్ బస్సులు సిబిఎస్ హేంగర్ నుండి మాత్రమే నడుపబడును.
* వరంగల్, యాదగిరిగుట్ట వైపు వెళ్ళు షెడ్యూల్, స్పెషల్ బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్, ఉప్పల్ బస్‌స్టేషన్ మీదుగా నడుపబడును.
* నల్లగొండ వైపు వెళ్ళు షెడ్యూలు, స్పెషల్ బస్సులు దిల్‌సుఖ్‌నగర్ నుండి మాత్రమే నడుపబడును.
* టిఎస్‌ఆర్‌టిసి బస్సుల సమాచారానికై అసిస్టెంట్ మేనేజర్ 7382804885, 7382802218 సెల్ నెంబర్లను సంప్రదించవచ్చును.
* రెగ్యులర్ షెడ్యూల్స్‌లలోను సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయని ఇ.డి. ఆర్.నాగరాజు తెలిపారు. టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టిఎస్‌ఆర్‌టిసిఆన్‌లైన్.ఇన్ లో సంప్రదించాలని కోరారు.
ఈ సమావేశంలో రంగారెడ్డి రీజియన్ ఆర్.ఎం.గంగాధర్, కస్టమర్ రిలేషన్ మేనేజర్ రాఘవేంద్రరెడ్డి, సీనియర్ చీఫ్ రిలేషన్ మేనేజర్ భవానిప్రసాద్, డిప్యూటీ చీఫ్ మేనేజర్ డి.విజయభాను తదితరులు పాల్గొన్నారు.