హైదరాబాద్

తుది దశలో పోలీసు బ్యారెక్‌ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: మెట్రోరైలు ప్రాజెక్టు కోసం పోలీసు శాఖకు చెందిన రసూల్‌పురా క్వార్టర్స్, మరో అయిదు ప్రాంతాల్లో అదే విభాగానికి చెందిన స్థలాలను సేకరించిన అధికారులు రూ. 25 కోట్ల అంఛనా వ్యయంతో నిర్మిస్తున్న పోలీసు బ్యారెక్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్లు మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. మరికొద్ది నెలల్లోనే పనులన్నీ పూర్తి చేసి వీటిని నగర పోలీసు శాఖకు అప్పగిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని గోషామహల్(షా ఇనాయత్ గంజ్), సిటీ కాలేజీ, చేలాపురా, రసూల్‌పురా ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఈ నాలుగు పోలీసు బ్యారక్ల పనులను ఆయన శుక్రవారం నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. గోషామహల్‌లో నిర్మిస్తున్న బ్యారక్ పనులు ఇప్పటికే పూర్తి చేసి, దాన్ని పోలీసు శాఖకు అప్పగించామని వెల్లడించారు. ఇక సిటీకాలేజీ, చేలాపురా, రసూల్‌పురాల్లోని బ్యారక్ల నిర్మాణం తుది దశలో ఉందని, మరికొద్ది నెలల్లోనే పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో ఈ పోలీసు బ్యారక్లను నిర్మించినందుకు మెట్రోరైలు ఎండిని అభినందించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ ప్రకారం ఈ బ్యారక్‌లు మున్ముందు పోలీసులకు ఎంతో ఉపయోగపడుతాయని వ్యాఖ్యానించారు. ఒక్కొక్క బ్యారక్ సుమారు 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, ఒక్కొదానిలో దాదాపు 250 పోలీసులకు సౌకర్యం కల్పించవచ్చునని తెలిపారు. ఎపుడైనా నగరంలో శాంతిభద్రతల సమస్య తలెత్తినపుడు, అదుపులోకి తెచ్చేందుకు బందోబస్తు కోసం మనం తెచ్చుకునే కేంద్ర భద్రత బలగాలు గానీ, ర్యాపిడ్ యాక్షన్ బృందాలు గానీ ఇక్కడ బస చేసేందుకు ఎంతో సౌకర్యవంతంగా వీటిని నిర్మించినట్లు తెలిపారు.
అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఎంతో వ్యూహాత్మకంగా వీటిని నిర్మించినట్లు తెలిపారు. ఈ బ్యారక్‌లలో పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు వీలుగా, ఉన్నతాధికారులు కూడా బస చేసేందుకు అసరమైన సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. అంతేగాక, స్కిల్ డెవలప్‌మెంట్, ట్రెయినింగ్ సెంటర్‌ను కూడా ఇందులోనే వీటిల్లోనే ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. తనిఖీలో పలువురు పోలీసు, మెట్రో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.