హైదరాబాద్

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: రంగారెడ్డి జిల్లాలో రెండు బాలుర పాఠశాలలు, కందుకూర్, ఇబ్రహీంపట్నంలో రెండు బాలికల పాఠశాలలు, తాండూర్, పరిగిలో బాల బాలికల కోసం నూతనంగా ప్రారంభమయ్యే గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవతరగతిలో ఎస్‌టి-64, ఎస్‌సి-10, బిసి-4, ఓసి-2 మొత్తం 80, ఆరవతరగతిలో ఎస్‌టి-32, ఎస్‌సి-5, బిసి-2, ఓసి-1 మొత్తం 40 సీట్ల కోసం జిల్లాలోని బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆమ్రాపాలి తెలిపారు.
దరఖాస్తు ఫారాలను టిజిటిడబ్ల్యు గురుకులము.తెలంగాణ జివో.ఇన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆగస్టు నెల నాలుగో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. పరిగి మండలం నస్కల్‌లో ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ 8440134956, ఇబ్రహీంపట్నం ఎస్‌టి హాస్టల్ ప్రిన్సిపాల్ వి.శైలజ 8008766923కి పూర్తిచేసిన ఫారాలను అందజేసి హాల్‌టిక్కెట్ పొందాలని పేర్కొన్నారు. ఏప్రిల్ నెల 18న జరిగిన గిరిజన గురుకుల ప్రవేశ పరీక్షలో హాజరైన విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.