హైదరాబాద్

చనిపోయాక ప్రమోషన్ ఇచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: మహానగర పాలక సంస్థ పేరుకే గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది. బతికున్నపుడు ఏళ్ల తరబడి సేవ చేసినా, ఇవ్వాల్సిన ప్రమోషన్ ఇవ్వని అధికారులు చనిపోయిన తర్వాత పదోన్నతి కల్పించటం గమనార్హం. కొద్ది రోజుల క్రితం విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు రాములమ్మకు 2019 సంవత్సరం వరకు సర్వీసు ఉండగా, గత జనవరి మాసంలో ఆమెకు తెలియకుండానే ఆమెను రిటైర్డు చేసి అధికారులు ఘనత వహించిన ఉన్నతాధికారులు అధికారులు ఇపుడు డ్రైవర్లకు పదోన్నతులు కల్పించటంలోనూ అదే తప్పు చేశారు. రాములమ్మ వ్యవహారం వెలుగుచూడటంతో ఆమెను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించినా, ఇంకా అధికారులు నానబెడుతున్నారంటే వారి విధి నిర్వహణ ఎంత గొప్పదో తెల్సుకోవచ్చు. అంటే జిహెచ్‌ఎంసిలో ఎంత మంది పర్మినెంటు ఉద్యోగులున్నారు? వారెపుడెపుడు రిటైర్డు అవుతున్నారన్న సమాచారాన్ని కూడా సక్రమంగా మెయిన్‌టైన్ చేయటం లేదని తేలిపోయింది. జిహెచ్‌ఎంసిలోని 78 మంది డ్రైవర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఈ నెల 28వ తేదీన అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అందులో ఇప్పటికే రిటైర్డు అయిన వారు, చనిపోయిన వారు ఉండటం గమనార్హం. జిహెచ్‌ఎంసిలో ఇతర విభాగాలకు చెందిన అధికారుల హవా ఎక్కువగా నడస్తుండటంతో తమకు రావల్సిన ప్రమోషన్లు సకాలంలో రావటం లేదని ఇప్పటికే పలు సార్లు ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగులకు నేటికీ న్యాయం జరగటం లేదు. ఫలితంగా అటెండర్‌గా విధుల్లో చేరిన ఉద్యోగులు కొందరు అటెండర్లుగానే రిటైర్డు అయిన దాఖలాలున్నాయి. ఇందులో నాలుగున్నరేళ్ల క్రితం మృతి చెందిన ఎం.డి.రషీద్, రెండేళ్ల క్రితం రిటైర్డు అయిన అంజయ్యలకు పదోన్నతులు కల్పిస్తూ తప్పుల తడకగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే రిటైర్డు అయి మృతి చెందిన వారి పదోన్నతులకు సంబంధించి ప్రక్రియ ప్రాసెస్‌లో ఉందని భావించవచ్చు కానీ ఏకంగా నాలుగేళ్ల క్రితం మృతి చెందిన రషీద్, రెండేళ్ల క్రితం రిటైర్డు అయిన వారు కనీసం ఉత్తర్వులు జారీ చేసే నాటికి పదవీలో ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని సైతం గుర్తించలేదంటే అధికారులు ఎంతటి నిర్లక్ష్యంతో వ్యవహారిస్తున్నారో అంచనా వేయవచ్చు నేటికీ విధులు నిర్వహిస్తూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులను పట్టించుకోకుండా ఏకంగా మృతి చెందిన, రిటైర్డు అయిన వారికి పదోన్నతులు కల్పించటంపై ఉద్యోగులు, కార్మికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అలాంటి తప్పిదమే కింది స్థాయి ఉద్యోగులు చేస్తే తీవ్రంగా స్పందించే అధికారులు ఇపుడు తమకేం సమాధానం చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ జాబితాలో 19 మందిని పక్కనబెట్టి మృతి చెందిన వారి, రిటైర్డు అయిన వారి పేర్లు చేర్చటం వెనక అధికారుల అంతర్యమేమిటీ? అని ప్రశ్నిస్తున్నారు.
అర్హులకైన సకాలంలో ప్రమోషన్లు ఇవ్వండి
జిహెచ్‌ఎంఇయూ అధ్యక్షుడు ఊదరిగోపాల్
కింది స్థాయి కార్మికులంటే అధికారులకు చిన్నచూపైపోయిందని, అర్హులకు సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాల్సిన అధికారులు రిటైర్డు అయిన, చనిపోయిన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వటం పట్ల జిహెచ్‌ఎంఇయూ అధ్యక్షులు ఊదరిగోపాల్ మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకుని నేటికీ ప్రమోషన్లకు అర్హులైన వారిని గుర్తించి వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రమోషన్లు కల్పించటంలో అధికారులు సీనియార్టీ జాబితాను పరిగణలోకి తీసుకోవటం లేదన్న విషయం మరోసారి తేలిపోయిందన్నారు. మృతి చెందిన, రిటైర్డు అయిన వారికి పదోన్నతులు కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా గోపాల్ డిమాండ్ చేశారు.