హైదరాబాద్

అమ్మా బయలెల్లినాదో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా బయలెల్లినాదో..!
హైదరాబాద్, చార్మినార్, జూలై 31: అమ్మాబయలెల్లినాదో నాయన.. తల్లి బయలెల్లినాదో.. అమ్మా కాపాడమ్మా.. కరుణించమ్మా.. చల్లంగచూడమ్మా.. జై మాతాజీ జై.. అనే నినాదాలతో పాతబస్తీ మారుమోగింది. గల్లీగల్లీలోనూ ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. పురవీధులన్నీ అమ్మోరి నామస్మరణతో పులకరించిపోయాయి. ఆషాడమాసం బోనాల జాతరను పురస్కరించుకుని ఆదివారం పాతబస్తీలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. బోనాల సందర్భంగా పాతబస్తీ ప్రత్యేక శోభను సంతరించుకుంది. చార్మినార్‌లోని ఓ మినార్‌లో వెలిసిన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు, లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారితో పాటు గల్లీగల్లీల్లోని అమ్మవారి ఆలయాల వద్ధ ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. లాల్‌దర్వాజ అమ్మోరి ఆలయం వద్ధ దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. కొందరు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు దర్శించుకున్నారు. భారీ బందోబస్తు మధ్య పాతబస్తీ బోనాలు ప్రజలు అత్యంత ఘనంగా ప్రశాంతంగా జరిగాయి. నగరంలో భారీ విధ్వంసానికి కుట్ర చేసిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకోవటంతో, బోనాలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అడుగడుగున నిఘాను ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికపుడు పరిస్థితులను పర్యవేక్షించారు. మహాననగరంలోని సికింద్రాబాద్ మినహా మిగిలిన దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా, ప్రశాంతంగా జరిగిన సంగతి తెలిసిందే. పాతబస్తీలోని ప్రతిష్టాత్మకమైన పలు దేవాలయాల్లో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించటంతో పాటు ఏర్పాట్లకు నిధులు కూడా మంజూరు చేస్తుండటంతో ప్రతి దేవాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రజలతో పాటు ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. వివిధ రాజకీయ ప్రముఖులు పాతబస్తీలోని చారిత్రాత్మకమైన లాల్‌దర్వాజలోని శ్రీసింహవాహిని మహాంకాళీ అమ్మవారిని, శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంతో పాటు చార్మినార్‌లోని ఓ మినార్‌లో వెలసిన శ్రీ్భగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాలకు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అమ్మవారికి బోనాలు, టెంకాయలు సమర్పించుకుని తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. బోనాలు ఆనందోత్సవాలకు ప్రతీకగా, ప్రశాంతంగా జరిగేందుకు ముందుజాగ్రత్త చర్యగా శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసులు ప్రత్యేక బందోబస్తును చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్‌ఏఎఫ్, సిఐఎస్‌ఎఫ్ బలగాలతో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన పలు దేవాలయాల ఆవరణలో పోలీసులు బోనాలు ఊరేగింపుగా వచ్చే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. నెలరోజుల పాటు శాంతిభద్రతల పరిరక్షణ సవాలు మారినా.. ఆదివారం నాటి బోనాల ఉత్సవాలు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతగా జరగటంతో పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఊపరిపీల్చుకున్నారు.
పాతబస్తీలో..
పాతబస్తీలో ఆదివారం ఆషాఢమాస బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. లాల్‌దర్వాజ సింహవాహిని మహాంకాళి దేవాలయం, హరిబౌలి అక్కన్న మాదన్న దేవాలయం, గౌలిపుర శ్రీమహంకాళి మాతేశ్వరి, ఉప్పుగూడ శ్రీమహంకాళి అమ్మవారు, విలారం మండి శ్రీమహంకాళి దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాలకు ఆయా రాజకీయ పక్షాల ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. లాల్‌దర్వాజ సింహవాహిని దేవాయలంలో ఆదివారం ఉదయం తెల్లవారుజామున తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టి.వీరేందర్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పాలక మండలి మంత్రికి పూర్ణకుంబంతో స్వాగతం పలికారు. డిప్యూటి సిఎం పద్మా దేవేందర్‌రెడ్డి బంగారు బోనం సమర్పించారు. బంగారు తెలంగాణగా నిర్మాణం కావలనే బంగారు బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి శాసనసభ పక్షనేత జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డికె అరుణ, భట్టి విక్రమార్క, అంజన్‌కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, దానం నాగేందర్ పాల్గొని అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముషీరాబాద్‌లో..
ఆషాడమాస బోనాల ఉత్సవాలు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముషీరాబాద్‌లో శ్రీమహంకాళి దేవాలయం, రాంనగర్ పోచమ్మదేవాలయం, ముత్యాలమ్మ దేవాలయం, లోయర్‌ట్యాంక్‌బండ్ శ్రీకనకాలకట్టమైసమ్మ దేవాయలంతోపాడు నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రాంతాలలో దేవాయలయాలను పలువు ప్రముఖులు సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టిఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముఠా గోపాల్ తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్లు వి.శ్రీనివాస్‌రెడ్డి, లాస్య నందిత, ముఠా పద్మ నరేష్ స్థానికంగా బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పద్మారావు
సికింద్రాబాద్: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని మంత్రి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో అమ్మవారి బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిలకలగూడ కట్టమైసమ్మ అమ్మవారికి మంత్రి పద్మారావు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు దేవాలయాలను సందర్శించారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని అన్నారు. సికింద్రాబాద్ అనగానే బోనాల పండుగకు ఒక ప్రత్యేకత ఉందని, అత్యంత కోలాహలంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని తార్నాక, మాణికేశ్వర్‌నగర్, లాలాపేట్, శాంతినగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, చిలకలగూడ, సీతాఫల్‌మండి తదితర ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివసత్తుల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, ఫలహార బండ్లు, తీన్‌మార్ నాట్యాలతో అత్యంత కోలాహలంగా ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణ చోటు చేసుకుంది. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా నార్త్‌జోన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయాల వద్ద ప్రత్యేక బలగాలను మొహరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నార్త్‌జోన్ పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. చిలకలగూడలో జరిగిన బోనాల ఉత్సవాలకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కంటోనె్మంట్ - అల్వాల్‌లో
అల్వాల్: కంటోనె్మంట్ - అల్వాల్ ప్రాంతంలో అషాడ బోనాలజాతర ఘనంగా నిర్వహించారు. వాడవాడలో ఉన్న అమ్మవారి దేవాలయాలు అన్ని భక్తుల బోనాలు, ఫలహారం బండ్లు, తోట్టెల సమర్పన, పోతరాజుల విన్యాసాలతో హోరెత్తిపోయాయి. బోయిన్‌పల్లిలోని ఏడుగుళ్లలో జరిగిన జాతరలో కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి.సాయన్న, మల్కాజిగిరి ఎంపి చామకూర మల్లారెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, కంటోనె్మంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్, సీనియర్ నాయకులు టిఎన్ శ్రీనివాస్, కంటోనె్మంట్ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. దేవాలయా నిర్వహక కమిటీ సభ్యుడు మర్రి అమరేందర్ రెడ్డి.. అతిథితులందరికి దేవాలయ మర్యాద పూర్వకంగా సన్మానించారు. అన్నానగర్‌లో జరిగిన బోనాల జాతరలో బోర్డు పాలక మండలి వైస్ చైర్మన్ సాదా కేశవరెడ్డి పాల్గొన్నారు.
సైదాబాద్‌లో
సైదాబాద్: తెలంగాణ సంప్రదాయ బోనాల వేడుకలు సైదాబాద్, మలక్‌పేట్, అక్బర్‌బాగ్, ఐఎస్ సదన్, మాదన్నపేటలలో ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారి ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సైదాబాద్ మాత మైదానంలోని విజయదుర్గామాతా దేవాలయంలో రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్ స్వర్ణలతారెడ్డి, తూర్పు మండల డిసిపి రవీందర్, ఇన్‌స్పెక్టర్ సత్తయ్య, సినీ నటుడు వేణుమాధవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, వేణుమాధవ్‌తో కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతా శ్రీనివాస్‌రెడ్డి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటించారు. జీవన్‌జ్యోతి సంఘంలోని జయదుర్గామాతా దేవాలయంలో బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు బోనాలను ఎత్తుకొని ఆలయానికి తరలి వచ్చారు. బోనాల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో అనురాధ భవిష్యవాణి వినిపించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొరుడు భూమేశ్వర్, అమరేశ్వర్, డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కావేటి ధర్మరాజు, పొదిళ్ల శ్రీధర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐఎస్ సదన్ కార్పొరేటర్ సామ స్వప్నసుందర్‌రెడ్డి డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, సింగరేణికాలనీ, విష్ణునగర్, సుబ్రమణ్యనగర్‌లోని అమ్మవారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేటర్ దంపతులను సన్మానించారు. బోనాల వేడుకల్లో టిఆర్‌ఎస్ నాయకులు శంకరాచారి, మనె్నరంగ, భాస్కర్‌రెడ్డి, పురుషోత్తం పాల్గొన్నారు.
బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు
నేరేడ్‌మెట్: ఆషాఢమాస బోనాల జాతర సందర్భంగా ఆదివారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో బోనాల జాతర ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని పాత మల్కాజిగిరి అమ్మవారి ఆలయం, ఆనంద్‌బాగ్ బందర్ పోచమ్మ, సఫిల్‌గూడ కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉదయం నుండే మహిళలు పెద్దసంఖ్యలో బారులుతీరి బోనాలు సమర్పించారు. మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి నందికంటి శ్రీ్ధర్, డిసిపి రాంచంద్రారెడ్డి పాతమల్కాజిగిరి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంద్‌బాగ్ బందర్ పోచమ్మ ఆలయంలో మాజీ కార్పొరేటర్ వై.ప్రేంకుమార్ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నిచర్యలు తీసుకున్నారు.