హైదరాబాద్

అందరినీ చల్లగా చూస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, ఆగస్టు 1: పాతబస్తీలోని బోనాలు ప్రశాంతంగా ముగిసాయి. రెండవ రోజైన రంగం కార్యక్రమంలో రాష్ట్రాంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఏపి, మహారాష్ట్ర నుంచి భక్తులు విచ్చేశారు. మొదటిసారిగా మిరాలంమండి మహంకాలేశ్వరి ఆలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు స్వర్ణలత భవిష్యవాణి తెలిపింది. భవిష్యవాణిలో ఆలయ పునఃనిర్మాణం అయినందుకు సంతోషంగా ఉందని, భక్తులను చల్లాగా చూస్తానని, వర్షాలు సమృద్దిగా కురుస్తాయి, రాష్ట్ర ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉంటారు.
పెళ్లిగాని అబ్బాయి, అమ్మాయిలు ఐదు వారాల పాటు నన్ను దర్శించుకుంటే శుభం జరుగుతుందని అన్నారు. పాతబస్తీ అక్కన్నమాదన్న, గౌలిపురా మహంకాలి మాతేశ్వరి, సుల్తాన్‌షాహి బంగారు మైసమ్మ, ఉప్పుగుడలోని మహంకాలి ఆలయాలతో పాటు 12 ఆలయాల్లో అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. పాతబస్తీలో ప్రధాన ఆలయంలో సింహవాలి మహంకాలి ఆలయంలో అనురాధ భవిష్యవాణిని వినిపించారు. అషాడమాసం, శ్రావణం ఏడు వారాల పాటు నాకు శాఖ పెట్టాలని వినిపించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురుస్తాయని, ఆలయం చిన్నగా ఉంది, చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి నా ఆలయ కట్టడానికి స్థలం ఇవ్వమని చెబుతాను. ఉరేగింపు కార్యక్రమంలో విజయవాడ కళాకారులచే వివిధ వేషదారణలతో భక్తులను అలరించారు. ముత్యాలమ్మ ఆలయం, గౌలిపుర ఆలయాల వారు కళాకారులచే కృష్ణార్జున, శకటాలతో పాత ఉమ్మడి దేవాలయాల ఉరేగింపు భక్తుల కోలాహలాల మధ్య కొనసాగింది. డప్పు వాయిద్యాలు, లయబద్దమైన నృత్యాలతో అమ్మవారిని ఉరేగింపులు నిర్వహించారు. అమ్మవార్ల ఉరేగింపు పురస్కరించుకొని పోలీసులు గట్టిబందోస్తు నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యవేక్షణ కోసం వచ్చిన సిపి మహేందర్ రెడ్డి సింహవాహిణి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కొరుకుట్టు చెప్పారు. చార్మినార్ వద్ద ఎంఐఎం పార్టీ తరుపున పురానాపుర్ కార్పొరేటర్ స్వాగత వేదికను ఏర్పాటు చేశారు. మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో వేదికను ఏర్పాటు చేశారు. సామూహికంగా వచ్చే అమ్మవారి ఉరేగింపులకు స్వాగతం పలికారు. సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ పర్యవేక్షణలో ఉరేగింపులు ప్రశాంతంగా జరిగాయి. అక్కన్న మాదన్న దేవాలయ బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని రజని అనే అంబారిని ఊరేగించారు.
అమ్మ ఆశీస్సులతో విస్తారంగా వర్షాలు
నార్సింగి: పాతనగరంలో బోనాలు ఉత్సవాలు పురస్కరించుకుని సోమవారం రంగం, బలిగంప, తొట్టెల ఊరేగింపులో భాగంగా పలు దేవాలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దేవాలయాల వద్ద వివిధ కార్యక్రమాలు కమిటీ నిర్వహాకులు నిర్వహించారు. ఉత్సవాలను తనివితీర చూసేందుకు భక్తులు భారులు తీరారు. చారిత్రాత్మకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ అమ్మవారికి పూజలను నిర్వహించారు. కాగా సోమవారం మధ్యాహ్నం రంగం, బలిగంప, రాత్రి భారీ తొట్టెల ఊరేగింపును కొనసాగించారు. మధ్యాహ్నం దేవాలయం ప్రాంగణంలో కార్వాన్ ప్రాంతంలోని వివిధ రంగాలలో ప్రతిభ కనభరిన విద్యార్థులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సికింద్రబాద్ మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, స్థానిక నాయకులతో పాటు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా లంగర్‌హౌస్‌లోని శ్రీబుజీలీ మహాంకాళీ దేవాలయంలో రంగం, బలిగంప, తొట్టెల ఊరేగింపు అంగరంగా వైభవంగా కొనసాగింది.
భవిష్యవాణిలో..
తెలంగాణ రాష్ట్రాంలోని ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురిశాయని, అంతేకాకుండా విస్తారంగా మరిన్ని వర్షాలు కురుస్తాయని తెలిపారు. రైతులు పంటలు పండిస్తారని పచ్చికుండపై సుశీల భవిష్యవాణిలో భక్తులకు వినిపించారు. కార్వాన్‌లో చారిత్రాత్మకమైన దర్బార్ మైసమ్మ దేవాలయంలో సోమవారం సాయంత్రం భవిష్యవాణిలో భక్తులకు వినిపించారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలంటే భక్తులు పూజలు చేయాలని పేర్కొన్నారు. మరుబోనం కూడా చేయాలని తెలిపారు. లంగర్‌హౌస్‌లో శ్రీ బుజిలీ మహాంకాళీ దేవాలయంలో కూడా భవిష్యవాణి నిర్వహించారు.
ఫలహార బండ్లు ఊరేగింపు
బోనాల ఉత్సవాలు పురస్కారించుకుని భక్తులు ఫలహార బండ్లను భారీగా ఊరేగింపుగా తీసుకవచ్చి అమ్మవారికి సమర్పించారు. సోమవారం రాత్రి లంగర్‌హౌస్ బాపూఘాట్ గాంధీనగర్ కాలనీలో భక్తులు ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహార బండిని ఏర్పాటు చేశారు. అయితే గాంధీనగర్ నుంచి లంగర్‌హౌస్ కట్ట మైసమ్మ దేవాలయం వరకు ఈ ఫలహార బండిని కొనసాగించారు. ఫలహార బండిలో అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పువాయిజ్యలతో, పోతురాజుల నృత్యాలతో ఈ ఊరేగింపు కొనసాగింది. భక్తులకు ప్రసాదం కూడా అందజేశారు.
తొట్టెల ఊరేగింపు
నగరంలోని చారిత్రాత్మక మైన కార్వాన్ దర్భార్ మైసమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే నగరంలోని అతిపెద్ద తొట్టెలను ఏర్పాటు చేశారు. అమ్మవారికి సమర్పించిన భారీ తొట్టెల ఊరేగింపును అంగరంగ వైభవంగా డప్పువాయిద్యాలతో.. పోతురాజుల నృత్యాలతో.. తొట్టెలను నిమజ్ఞనానికి తరలించారు. లంగర్‌హౌస్‌లోని శ్రీబుజిలీ మహాంకాళీ అమ్మవారి దేవాలయంలో కూడా భారీ తొట్టెల ఊరేగింపు సంఘం మూసీనది వరకు కొనసాగించారు. సంఘంలో భారీ తొట్టెలను నిమజ్జనం చేశారు. కాగా సోమవారం రాత్రి కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం నుంచి గణేష్‌ఘాట్ వరకు అడుగడుగున స్వాగత వేధికలను ఏర్పాటు చేశారు. ముస్లింలు స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు. తొట్టెల ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంతో పాటు పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పశ్చిమ మండల డిసిపి ఎ.వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయంతో పాటు లంగర్‌హౌస్ శ్రీబుజీలీ మహాంకాళీ దేవాలయం వద్ద పోలీస్ బందోబస్తును నిర్వహించినట్లు తెలిపారు. రంగం, బలిగంప, తొట్టెల ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతమైన వాతావారణంలో నిర్వహించుకున్నారని తెలిపారు. కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం వద్ద విద్యార్థులకు డిసిపి బహుమతులను ప్రదానం చేశారు.