హైదరాబాద్

దర్శకరత్నకు పాటల పల్లకిలో నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ‘తాతామనవడు’ చిత్రం ద్వారా దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావుకు ‘ఇది మేఘసందేశమో’ అనే శీర్షికన సినీగీతాల మందారమాలతో పాటల పల్లకిలో ఘనంగా సత్కరించారు. యువకళా వాహిని ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలను స్వరాభిషేకంతో శారద ఆకునూరి నేతృత్వంలో సర్వాభిషేకం చేసారు. ఈ కార్యక్రమానికి సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించగా సినీనటి జమున జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. అభిమానం వుంటే చాలు సత్కారాలు వద్దు అంటూ సన్మానాన్ని నిరాకరించిన దాసరి నారాయణరావు శాలువా కప్పి శారదా ఆకునూరిని సత్కరించి జ్ఞాపిక ప్రదానం చేశారు. రాత్రి 9 గంటలు దాటుతున్నప్పటికి దాసరి నారాయణరావు ప్రసంగించలేదు. ఈ కార్యక్రమంలో దర్శకులు కోడి రామకృష్ణ, నటుడు జివి నారాయణరావు, కైకాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆకునూరి శారదా నేతృత్వంలో దాసరి దర్శకత్వం వహించిన సినీ గీతాలను ఆలపించారు. అతిధులకు సత్కారం పేరుతో దాసరిని శాలువా కప్పి ఆహ్వానితులు తమ కోర్కెను తీర్చుకున్నారు.