హైదరాబాద్

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 2: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీ గురురామదాస్‌నగర్‌కు చెందిన సమీర్ అలియాస్ సుజిత్ రాయ్ (34) వివిధ పత్రికల్లో అర్జెంట్ రిక్వైర్‌మెంట్ అంటూ ప్రకటనలు గుప్పిస్తాడు. సదరు ప్రకటనలో తన ఈ-మెయిల్ ఐడి, ఇతరుల పేరుపై తీసుకున్న ఫోన్‌నెంబర్‌ను ఇస్తాడు. ఈప్రకటనలు చూసి స్పందించిన వారికి సింగపూర్ దేశంలో పెద్దపెద్ద హోటళ్లలో క్యాషియర్ వంటి పోస్టులు ఉన్నాయని, వేతనాలు సైతం బాగా ఉంటాయని నమ్మబలుకుతాడు. సదరు దేశానికి వెళ్లేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రయాణ చార్జీలు, విసాచార్జీలు ఉంటాయని చెబుతాడు. ఇందు కోసం తాను సూచించిన అకౌంట్‌లో డబ్బులు వేయాలని సూచిస్తాడు. ఆ అకౌంట్ కూడా గతంలో ఇతన్ని నమ్మి పాస్‌పోర్టు, సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చిన వారి పేరుమీద తీసుకుంటాడు. సమీర్ చెప్పినట్టుగా డబ్బులు వేసిన వారికి నకిలీ వీసా, ప్రయాణ టికెట్లు, వర్క్ పర్మిట్లు పంపుతాడు. ఈ తరహాలో మోసపోయిన నల్లగొండ జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ ప్రారంభించే లోపే ఢిల్లీకి వెళ్లిపోయాడు.
ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వలపన్ని సమీర్‌ను పట్టుకొని విచారించగా మోసాలకు పాల్పడట్టు ఒప్పుకున్నాడు. గతంలో ఇతనిపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో సైతం ఓ కేసు నమోదై ఉంది.
ఈ మేరకు చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు సమీర్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా ఇదే కేసులో ఇతరుల డాక్యుమెంట్లను పెట్టుకొని బ్యాంకు ఖాతా ఎలా తెరుస్తున్నారంటూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వారిని పిలిచి విచారించారు. మరో మారు తమ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.