హైదరాబాద్

సికిందరాబాద్‌లో నకిలీ పోలీసుల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: సికిందరాబాద్‌లో నకిలీ పోలీసులు హల్‌చల్ చేశారు. ఓ వ్యాపారి బ్యాగుల్లో బ్రౌన్ షుగర్ ఉందంటూ తనిఖీ చేస్తూ దృష్టి మరల్చారు. దుండగులు వ్యాపారి వద్ద నుంచి రూ. 7.5 లక్షలతో ఉడాయించిన సంఘటన బుధవారం మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికిందరాబాద్ సుభాష్‌నగర్‌కు చెందిన గోపినాథ్ ఇటీవల వ్యాపార నిమిత్తం చెన్నై వెళ్లారు. చెన్నై-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో రూ. 20 లక్షల నగదు, 25 కిలోల వెండితో తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం గోపినాథ్ సికిందరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వస్తున్న క్రమంలో ఇద్దరు ఆగంతకులు అటకాయించి మేము పోలీసులం..మీ బ్యాగ్ తనిఖీ చేయాలి..మీ వద్ద బ్రౌన్ షుగర్ ఉందంటూ బెదిరించారు.గోపినాథ్ తన బ్యాగులను తనిఖీ చేసుకోవచ్చని చెప్పడంతో దుండగులు గోపినాథ్ వద్ద ఉన్న రూ. 20 లక్షలు, 25 కిలోల వెండి సామగ్రిని సోదా చేస్తున్నట్టు నటించి దృష్టి మరల్చారు. రూ. 7.5 లక్షల నగదుతో ఉడాయించారు. తాను మోసపోయానంటూ గ్రహించిన బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు గోపినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు జరుపుతున్నారు. సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఇద్దరు అనుమానితుల ఫొటోలను సేకరించినట్టు మహంకాళి పోలీసులు తెలిపారు.

దవాఖానకు దారేది?

హైదరాబాద్, ఆగస్టు 3: మహానగరంలో తరుచూ కురుస్తోన్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలుతాయన్న విషయం తెలిసినా, ప్రతి సంవత్సరం ఎంతో మంది డెంగీ, స్వైన్‌ఫ్లూ, కలరా, మలేరియా తదితర వ్యాధుల బారిన పడుతూ, దవాఖానకు దారి వెతుక్కుంటున్నారు. ప్రతి ఏటా సీజనల్ వ్యాధుల బారిన పడుతూ కొందరు మృతి చెందినా, అధికార యంత్రాంగం మాత్రం కళ్లు తెరవటం లేదు. రెండు జిల్లాల్లో ఎప్పటికపుడు ప్రజారోగ్య పరిరక్షణ కోసం వ్యాధి నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నా, వారెలాంటి విధులు నిర్వహిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కావటం లేదు.
గడిచిన కొద్దిరోజులుగా నగరంలో తరుచూ కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే పలు చోట్ల డెంగీ వ్యాధి కేసులు నమోదు కాగా, కొద్దిరోజుల క్రితం కలరా కూడా వెలుగుచూసిన సంగతి తెలిసిందే. నగరంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే బస్తీలు, పేదలు నివసించే మురికివాడలకు సుస్తీ ఏర్పడింది. నగరంలోని సుమారు 1400 పై చిలుకు మురికివాడల్లో ప్రస్తుతం మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ వ్యాధుల అనుమానిత లక్షణాలతో వందలాది మంది సర్కారు, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి గడిచిన వారం రోజుల నుంచి రికార్డు స్థాయిలో ఔట్ పేషెంట్లు వస్తున్నారు. వీరంతా కూడా కలరా, డెంగీ, స్వైన్‌ఫ్లూ, మలేరియా వంటి వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్న వారే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫీవర్ ఆసుపత్రికి నాలుగు రోజుల క్రితం ఒకే రోజు 2600 మంది ఔట్ పేషెంట్లు హాజరైనట్లు సమాచారం. రోగుల సంఖ్యకు తగిన విధంగా వైద్యులు, సౌకర్యాలు లేకపోవటంతో రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. జ్వరంతో మూలుగుతూ వచ్చిన రోగులు కనీసం కూర్చునేందుకు కూడా సీట్లు లేకపోవటం ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. రోగుల తాకిడి ఎక్కువ కావటంతో ఆసుపత్రివర్గాలు ఔట్ పేషెంటు సమయాన్ని సాయంత్ర నాలుగు గంటల వరకు పెంచాల్సి వచ్చింది. దీంతో పాటు నిలోఫర్ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రితో పాటు ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ రోగుల రద్దీ కన్పిస్తోంది.
ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో పాటు మలేరియా లక్షణాలతో బాధపడుతూ కాస్త ఆర్థిక స్తోమత ఉన్న వారు సమీంపలోని నర్సింగ్ హోంలలో, ప్రైవేటు ఆసుపత్రులు, క్లీనిక్‌లలో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రైవేటు దవాఖానల్లో చూపించుకునే స్తోమత లేని వారు ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య తక్కువగా ఉన్నందున, జిల్లా వైద్యాధికారులు ఇలాంటి రోగులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారే తప్పా, బస్తీలు, మురికివాడలకు చెందిన ప్రజలు ఎంతో మంది క్ల్లినిక్‌లలో చికిత్స పొందుతున్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించి వెంటనే వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

హైదరాబాద్, ఆగస్టు 3: యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరు నిర్దేశిత పరీక్ష కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని హైదరాబాద్ జిల్లా యుపిఎస్సీ నోడల్ అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. ఈనెల 7న జరగనున్న యుపిఎస్సీ ప్రిలిమనరీ పరీక్షలకు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని బుధవారం పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పాఠశాల విద్యా సంచాలకులు కిషన్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం జరగనున్న యుపిఎస్‌సి పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామని ఆరోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వస్తున్నందున కొంతమేర ట్రాఫిక్ ఆంక్షలు వుండే అవకాశం వుందని అందువల్ల అభ్యర్థులు ముందస్తుగా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకుంటే బాగుంటుందని సూచించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పరీక్షను నిర్వహించడంలో ఎటువంటి అలసత్వం లేకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు, ఇన్విజిలేటర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో గల వంద పరీక్షా కేంద్రాలలో ఒకటి తప్ప మిగిలినవన్నీ గత సంవత్సరం పరీక్ష నిర్వహించిన కేంద్రాలేనని అన్నారు. సంబంధిత అధికారులందరు గత సంవత్సరం పరీక్షను నిర్వహించిన అనుభవం వుందంటూ ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోరాదని పరీక్ష నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి తదనుగుణంగా నడుచుకోలాలన్నారు. ముఖ్యంగా ఎంసెట్-2 పరీక్షకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఆ రకమైన అంశాలు తలెత్తే అవకాశం లేకుండా కోఆర్డినేటింగ్ అధికారులు, సూపర్‌వైజర్లు, అత్యంత జాగరూకతతో వ్యవహరించాలన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి సరఫరా చేసిన బుక్‌లెట్లలోని సూచనలు చదివి ఆకళింపు చేసుకుని తదనుగుణంగా పరీక్ష నిర్వహించాలన్నారు యుపిఎస్‌సి కమిషన్ అభ్యర్థుల హాజరుకు సంబంధించిన సమాచారాన్ని ఈసారి ఎస్‌ఎంఎస్ ద్వారా పంపాలని నూతన నిబంధన విధించిందని అట్టి సూచనలను అందరు పాటించి నిర్దేశిత సమయానికల్లా ఎస్‌ఎంఎస్ ద్వారా అటెండెన్స్‌ను పంపాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయనున్న కంట్రోల్ రూమ్ 23202113 నంబర్‌పై సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ నంబరు శనివారంనుండి అందుబాటులోకి వస్తుందని అన్నారు.
హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఎజెసి అశోక్‌కుమార్ మాట్లడుతూ ఆగస్టు 7న జరగనున్న యుపిఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం వంద పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వీటిల్లో ప్రోగ్రెసివ్ హైస్కూలు మాత్రమే నూతన పరీక్షా కేంద్రమని మిగిలినివన్నీ గత సంవత్సరం పరీక్షలు నిర్వహించిన కేంద్రాలేనన్నారు. పేపర్-1 ఉదయం 8.30నుండి 11.30 వరకు, పేపరు-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు జరుగుతుందని అన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్ జిల్లాలో కూడా 11 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు.పరీక్ష రోజున ఉదయం 7.30కల్లా సూపర్‌వైజర్లు తమ సిబ్బందితో సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలన్నారు.ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బాక్సులను పరీక్ష రోజున ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1.00 గంటలకు సురక్షితంగా ఆయా సూపర్‌వైజర్లకు అందచేయాల్సిన బాధ్యత కోఆర్డినేటింగ్ అధికారులదన్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సూపర్‌వైజర్లు పాటించాల్సిన నిబంధనలు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను ఆయన వివరించారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులోకి అనుమతించకూడదని సూపర్‌వైజర్లకు సూచించారు.అభ్యర్థులను పేపరు-1 పరీక్షకు 9.40 వరకు, పేపరు-2 పరీక్షకు 2.40 వరకు పరీక్ష హాలులోకి అనుమతించవచ్చని ఆయన తెలిపారు. అంతకంటే ఆలస్యంగా వస్తే అనుమతించకూడదన్నారు. ఈ సమావేశంలో కోఆర్డినేటింగ్ సూపర్‌వైజర్లుగా నియమితులైన వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, యుపిఎస్సీ, పోలీసు, తదితర అధికారులు పాల్గొన్నారు.