హైదరాబాద్

స్ర్తి తనను తాను రక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: భారతదేశంలో అనాదిగా పురుష ఆధిపత్యం నడుస్తోందని స్ర్తి ఆ ఆచారానికి అలవాటు పడిందని ఈ ఆచార సంప్రదాయాలతో స్ర్తి తనకు తాను వేరు చేసుకొని వివక్షకు లోనయ్యిందని అటువంటి స్ర్తిలకు హక్కుల గురించి తెలియజేస్తూ ప్రతీ స్ర్తి తనను తాను కాపాడుకునే విధానం తెలియచేయాలని, చట్టపరమైన హక్కుల గురించి తెలియ చేయాలని మహిళా అభ్యుదయవాది సర్వమంగళ గౌరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో అనగారిన వర్గాల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాలలో ఆమె ప్రసంగించారు. వేదనిలయం డైరెక్టర్ నాగార్జున శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళాలంటే స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అన్నారు. కష్టపడి పనిచేయాలనుకుంటే ఉపాధి దొరుకుతుందని, సోమరిపోతులా కూర్చొని ఉద్యోగం కావాలంటే రాదనన్నారు. చిన్నతనంలో పెట్రోల్ బంకులో పనిచేసిన బాలుడు ఈ రోజు దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరుగా వున్నారని, ఒకప్పుడు పది రూపాయల కూలీకి పనిచేసిన బాలుడు ఈనాడు అగ్రశ్రేణి సినీ దర్శకుడని, ఎవరైనా కష్టపడితేనే ఎదగగలరని అన్నారు.
లయన్ విజయలక్ష్మి మాట్లాడుతూ జీవితంలో మధురమైనది స్నేహం అని ఈ స్నేహం ద్వారా అవకాశాలు వెతుక్కుంటూ కష్టపడితే ఏదైనా సాధించ వచ్చునని అన్నారు. స్నేహంలో ఎదుటి మనిషిలోని భావం తెలుసుకోవాలని ఆమె అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం కల్పించిన వసతులను, చట్టంలోని నియమ నిబంధనలను అందరికి తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, కె.అనుపమ, మనోహర్, సోషల్ వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

జెబి రాజుకు అమృతోత్సవం
హైదరాబాద్, ఆగస్టు 3: ప్రముఖ సంఘ సంస్కర్త, పదునాలుగు గంటలపాటు నిర్విరామంగా ప్రసంగించి ప్రపంచ రికార్డ్ సాధించిన అంబేద్కర్ వాది జెబి రాజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ జన్మదినోత్సవం జరుపుకుంటున్న సంఘ సంస్కర్త అని బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో ఘనంగా సత్కరించారు. సామాజిక సేవా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో గాయని ఆమని ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో సినీ గీతాలను ఆలపించారు. సభా కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, ప్రజాగాయకుడు గద్దర్ పాల్గొని జెబి రాజును గజమాలతో ఘనంగా సన్మానించారు. ఆకాశవాణి, పిఐబిలలో ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన జెబి రాజు అంబేద్కర్ ఆశయాల అమలులో నిస్వార్థంగా పనిచేసారని అతిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సన్మాన కమిటీ చైర్మన్ ఎస్. చెన్నయ్య, ఎస్వీఆర్ మల్లేష్, ఉస్తాద్‌రాజు, కన్వీనర్ పివి రమణ తదితరులు పాల్గొన్నారు.