హైదరాబాద్

గ్రేటర్‌లో లక్ష్యాన్ని మించి హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: మహానగరంలో మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం జిహెచ్‌ఎంసి రికార్డు స్థాయిలో మొక్కలు నాటేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని దాటింది. జూలై 11వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే! సుమారు 125 ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్చంధ సంస్థలను భాగస్వాములను చేస్తూ ప్రారంభించిన ఒక్కరోజే సుమారు 25లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని జిహెచ్‌ఎంసి అదే రోజు ఛేదించింది.
మొత్తం హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటలనుకున్న 81లక్షల మొక్కల లక్ష్యాన్ని దాటి గురువారం వరకు దాదాపు 83లక్షల మొక్కలను నాటినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు చైనాలోని గోబీ ఎడారిలో, అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకే రోజు పదిలక్షల మొక్కలు నాటిన రికార్డులుండగా, ఒకే రోజు పెద్ద ఎత్తున 25లక్షల మొక్కలు నాటి కొత్త రికార్డు సృష్టించిన జిహెచ్‌ఎంసి గడిచిన 25 రోజుల్లో 83లక్షల మొక్కలు అంటే, లక్ష్యంగా పెట్టుకున్న 81లక్షల మొక్కల కన్నా అదనంగా రెండు లక్షల మొక్కలను నాటి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించిందని అధికారులు చెబుతున్నారు. మొక్కలు నాటడమే గాక, వాటి పరిరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఇందుకు గాను ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థలు, యూనివర్శిటీలు, కంపెనీల్లోని ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేగాక, జిహెచ్‌ఎంసి పరిధిలో నాటి మొక్కల్లో 80 శాతం మొక్కలను ప్రహరీగోడ, గేటు వంటివి ఉన్న ఖాళీ స్థలాల్లో నాటినందుకు, మొక్కలను మేకలు వంటివి తినకుండా ఉంటాయని, అవి త్వరలోనే ఎదుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
దీనికి తోడు గత నెల 11వ తేదీన నిర్వహించిన హరితహారం కార్యక్రమం సందర్భంగా అధికారులు అందుబాటులో ఉన్న రకరకాల మొక్కలను మాత్రమే ప్రజలకు పంపిణీ చేయగా, ఇపుడు ప్రజలు కోరిన రకం మొక్కలను అందిస్తున్నందున, మున్ముందు ప్రజలు తమకిష్టమైన మరిన్ని మొక్కలు నాటే అవకాశముందని చెప్పవచ్చు.
ప్లాస్టిక్ ట్రీగార్డులు
హరితహారం కార్యక్రమం ప్రారంభమైన రోజు నాటి ఉత్సాహాంతో నేటికీ కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంలో ట్రీగార్డుల ఏర్పాటుకు ప్రత్యేక నిధులను కేటాయించినప్పటికీ కొన్ని ప్రధాన ప్రాంతాల్లో అతి తక్కువ వ్యయంతో వచ్చే ప్లాస్టిక్ ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ(ఆస్కీ)లో ప్రొఫెసర్ శ్రీనివాసచారితో కలిసి మొక్కలు నాటిన కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.
5వేల మొక్కలు పంపిణీ
హరితహారం కార్యక్రమం గురువారం కూడా బోరబండలో ఎంతో ఉత్సాహాంగా జరిగింది. ఇందులో భాగంగా డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ విద్యార్థినీ విద్యార్థులకు 5వేల మొక్కలను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సినీ హస్యనటుడు రఘు, సినీ హిరోయిన్ సన కూడా హజరయ్యారు.