హైదరాబాద్

ప్రధాని మోదీ సభకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ ఆగస్టు 6: నగరంలోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఆదివారం జరుగనున్న బిజెపి బహిరంగ సభలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్‌ఎస్‌జీ, ఎస్పీజి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయని, హైదరాబాద్‌లో నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని జోన్ల డిసిపిలు, రెండు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
మోదీ సభ సందర్భంగా ఆదివారం ఎల్‌బి స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో వాహనాలు మళ్ళించనున్నారు. ఇప్పటికే నగారానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు నగర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై భద్రత ఏర్పాట్లపై సమావేశమయ్యారు. నగర పోలీసు కమిషర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్ని జోన్‌లకు చెందిన డిసిపి, అదనపు డిసిపిలతో పిఎం భద్రతకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఎల్‌బిస్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు భారతీయ జనతా పార్టీ సభ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని రహదారులను మూసివేసి, మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలను మళ్లిస్తామని పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ విషయాన్ని నగర ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సిపి సూచించారు. మొత్తం మీద మోదీ సభ సిసి కెమెరాల నిఘాలో జరుగునుంది.
దారిమళ్లింపు మార్గాలు..
ఏఆర్ పెట్రోల్ పంపు జంక్షన్ మీదుగా వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించకుండా నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
అబిడ్స్, గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు అనుమతిస్తారు. ఈ వాహనాలను గన్‌ఫౌండ్రీ ఛపెల్ రోడ్డువైపు మళ్లిస్తారు.
బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి అబిడ్స్ జీపీవో వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద హైదర్‌గూడ, కింగ్‌కోఠి వైపు మళ్లిస్తారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు.
కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వెళ్లే వాహనాలు కింగ్‌కోఠి క్రాస్‌రోడ్డు వద్ద తాజ్‌మహల్ హోటల్ వైపు మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్ వద్ద హిమయత్‌దగన్ వైపు మళ్లిస్తారు.
ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను ఫీసీఆర్ వద్ద నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు.
ఎస్‌పి రోడ్డు, గ్రీన్‌ల్యాండ్స్, సిఎం క్యాంప్ ఆఫీసు, రాజ్‌భవన్ రోడ్డు, ఖైర్‌తాబాద్ జంక్షన్ రెండు వైపుల, బేగంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని నగర పోలీసులు కోరుతున్నారు.
వాహనాలు నిలుపు స్థలాలు
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఏన్టీఆర్ స్టేడియంలో నిలుపుకోవాల్సి ఉంటుంది.
రంగారెడ్డి, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీ మైదానంలో నిలపాల్సివుంటుంది.
మహబుబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి వచ్చే వాహనాలను అబిడ్స్ వద్ద, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిలుపుకోవాల్సి ఉంటుంది.
వీఐపీల వాహనాలను మాత్రం నిజాం కాలేజీ మైదానంలో నిలిపే విధంగా నగర పోలీసులు ఏర్పాట్లు చేశారు.

మోదీ సభకు సర్వం సిద్ధం
హైదరాబాద్, ఆగస్టు 6: ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి సారిగా హైదరాబాద్‌కు విచ్చేస్తున్న ప్రధాన మంత్రి మోదీ సభకు సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది హజరయ్యే ఈ బిజెపి సమ్మేళన కార్యక్రమ నిర్వాహణపై గడిచిన నెలరోజులుగా బిజెపి నేతలు ఏర్పాట్లపై మల్లగుల్లాలు పడుతూ, చివరకు శనివారం రాత్రి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియం చేరుకునే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభకు గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్ల కమిటీ నేతలతో పాటు అన్ని పోలింగ్ బూత్‌ల ప్రతినిధులు కూడా సభకు హజరయ్యే విధంగా బిజెపి ఏర్పాట్లు చేసింది. మోదీ ప్రసంగాన్ని స్పూర్తిగా తీసుకొని రానున్న 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేలా బిజెపి పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేసేలా మోదీ ప్రసంగం ఉంటుందని నేతలు అంచనాలు వేస్తున్నారు. నగరంలో నలుగురు కార్పొరేటర్లతో పాటు ఉప్పల్, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, టి,రాజాసింగ్, చింతలరామచంద్రారెడ్డిలతో పాటు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డిలు కూడా మోదీ సభను విజయవంతం చేయటంతో పాటు పార్టీకున్న క్యాడర్‌ను చాటేందుకు వీలుగా జన సమీకరణ చేయటంలో తలమునకలై ఉన్నారు. ఇందుకు గాను ఇప్పటికే గ్రేటర్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన అనేక మార్లు సమావేశాలను ఏర్పాటు చేసిన నగర స్థాయి నేతలను, అసెంబ్లీ నియోజవర్గాల కన్వీనర్లకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసమీకరణ నిమిత్తం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేశారు. రాష్ట్ర స్థాయి మొదలుకుని జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు, డివిజన్ అధ్యక్షులు, పోలింగ్ బూత్ వారిగా ఉన్న కమిటీల ప్రతినిధులు, బూత్ కన్వీనర్లతో బిజెపి అనుబంధ సంస్థలకు చెందిన ప్రతి కార్యకర్త కూడా మోదీ సభకు హజరయ్యేలా బిజెపి ప్రణాళికలు సిద్ధం చేసింది.

కృష్ణా పుష్కరాలకు పోలీసు శాఖ ఏర్పాట్లు
హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నదీ తీరం వెంట భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు శాఖ పేర్కొంది. అన్ని స్నాన ఘట్టాల వద్ద వాచ్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ యాప్‌లను రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తొలి కృష్ణా నది పుష్కరాలు కావడంతో యాత్రికులకు ఎటువంటి ఇక్కట్లు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. రెండుకోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించనున్నట్లు అంచనా వేశారు. కృష్ణా పుష్కరాలు మహబూబ్‌నగర్ పోలీస్, నల్లగొండ కృష్ణాపుష్కరాలు 2016 పేరిట యాప్‌లు విడుదల చేశారు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ రెండు యాప్‌లను అందుబాటులో ఉంచారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. నల్లగొండ జిల్లా పోలీసు శాఖ కృష్ణా పుష్కరాల కోసం ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ ఇ-బందోబస్తు అనే యాప్‌ను విడుదలచేసింది. పుష్కర ఘాట్‌లపై విలువైన సమాచారాన్ని ఈ యాప్‌ల ద్వారా అందించనున్నారు. వీటి రూపకల్పనకు మహబూబ్‌నగర్, నల్లగొండ ఎస్పీలు కృషి చేశారు. ఇరిగేషన్, విద్యుత్, అగ్నిమాపక, మత్స్యశాఖల మధ్య సమన్వయంతో ఈ యాప్‌ను రూపొందించారు. బీచుపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడ లక్షలాది మంది యాత్రికులు స్నానం చేయనున్నారు. కంట్రోల్ రూం బాధ్యతలు, పర్యవేక్షణను మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీకి అప్పగించారు. రెండు జిల్లాల్లోని అనేక ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలకు డిఎస్పీలను ఇన్‌చార్జిలుగా నియమించారు. ఘాట్ల వద్ద, జాతీయ రహదారులపై 360దాకా సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.