హైదరాబాద్

జడ్పీ సిఇఓగా రమణారెడ్డికి పూర్తి బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: రంగారెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ డిడి వి.రమణారెడ్డి పూర్తిస్థాయి జడ్పీ సిఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖకు నూతన డిడిగా విద్య నియమితులు కావడంతో శుక్రవారం రమణారెడ్డికి ఆ శాఖ అధికారులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ రమణారెడ్డి విధి నిర్వహణలో అధికారులకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. అంతకు ముందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల వార్డెన్‌లు, సిబ్బంది రమణారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ సహాయ సంక్షేమ అధికారులు వెంకటేశ్వరి, రాజన్న, జగదీశ్వర్, కేశవులు, అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.