హైదరాబాద్

నమో.. నమః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి సారిగా హైదరాబాద్ మహానగరానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జనం బ్రహ్మరథం పట్టారు. తొలుత ఆయన మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించినానంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. కానీ గజ్వేల్‌లో కూడా బహిరంగ సభకు ప్రధాని ‘మన్ కి బాత్’ వినేందుకు భారీగా జనం తరలివచ్చినా, పార్టీ పరంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా సమ్మెళనం సభకు సైతం మధ్యాహ్నం నుంచే భారీగా జనం చేరుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు ప్రసంగించిన అనంతరం వేదికపై నుండి నరేంద్రమోదీ చేసిన అభివాదానికి తెలంగాణ బిజెపి శేణ్రులు ఉర్రూతలూగాయి. వారిలో ఉత్సాహాన్ని మరింత పెంపొందించేందుకు ప్రధాని తనదైన శైలిలో తెలుగులో పలుకరించారు. కొత్తదనాన్ని సాధించాలంటే హైదరాబాద్‌తోనే సాధ్యమని ఆయన వ్యాఖ్యానించడంతో ఎల్బీ స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 17 వరకు ప్రతి ఒక్కరూ తిరంగ యాత్ర నిర్వహించాలని అది కేవలం ద్విచక్ర వాహనంపై 8 అడుగుల ఎత్తున జాతీయ పతాకంతో చేయాలని ప్రకటనతో బిజెపి, పార్టీకతీతంగా హాజరైన యువతలో హర్షం వ్యక్తం అయింది. ఈ యాత్రను సెప్టెంబర్ 17 వరకు ఎందుకు నిర్వహించాలంటే అదే రోజు తెలంగాణ విమోచన దినం, మీ ప్రధాని మోదీ పుట్టిన రోజని వ్యాఖ్యానించడంతో స్టేడియం మొత్తం భారత మాతకు జై అనే నినాదంతో దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, అంబర్‌పేట ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భారీగా జనసమీకరణ చేశారు. వీరితో పాటు నలుగురు కార్పొరేటర్లు కూడా తమ డివిజన్ల నుంచి మోదీ సభకు జనం తరలివచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు పాతబస్తీ, కార్వాన్, సికిందరాబాద్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలతో పాటు శివార్ల నుంచి జనం మధ్యాహ్నమే స్టేడియంకు చేరుకున్నారు. మోదీ సభను విజయవంతం చేసేందుకు బిజెపి నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారు ఊహించిన దాని కంటే అత్యధిక సంఖ్యలో అశేష జనవాహిని స్టేడియంకు తరలిరావటంతో స్టేడియం మొత్తం కాషాయపు శోభను సంతరించుకుంది. అంతేగాక, మోదీకి స్వాగతం పలుకుతూ నగరంలోని అన్ని రద్దీ కూడళ్లు, చౌరస్తాలు, మెయిన్ రోడ్లలో కూడా బిజెపి నేతలు భారీగా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్టేడియంలో ప్రదానితో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు ఇతర ముఖ్య నేతలు ఆశీనులయ్యేందుకు వీలుగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై నుంచి మోదీ అభివాదం చేయగానే ఒక్కసారిగా స్టేడియం కేరింతలు, క్లాపులతో దద్దరిల్లింది. ఇక మోదీ ప్రసంగం ప్రారంభించిన కొద్ది క్షణాలకే ఆయన తన ‘మన్ కి బాత్’ ఏం చెబుతారోననంటూ సభా ప్రాంగణంలో నిశ్శబ్దం రాజ్యమేలింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది జనం తరలివచ్చినా, మోదీ ప్రసంగం వినేందుకు పార్టీలకతీతంగా అత్యధిక సంఖ్యలో యువకులు, విద్యార్థులు తరలివచ్చారు. మోదీ రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే వారు అమలు చేసిన ట్రాఫిక్ ఆంక్షల కారణంగా మధ్యాహ్నం నుంచే బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, నాంపల్లి, లిబర్టీ చౌరస్తా, హైదర్‌గూడ, ఆబిడ్స్, పరిసర ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. సభకు వచ్చిన జనం వాహనాలకు పార్కింగ్‌ను ఏర్పాటు చేసిన నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్ చుట్టూ సభ ముగిసిన తర్వాత దాదాపురాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ జాం అయ్యింది.