హైదరాబాద్

సబ్సిడీ సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: జిల్లాలో సంక్రాంతి పండుగలోపు ప్రజలకు రేషన్ సరుకులు అందజేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. గురువారం పౌరసరఫరాల పంపిణీపై జడ్పీలో జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరి శంకర్, ఎఎస్‌ఓలు శ్రీనాథ్ రెడ్డి, విజయలక్ష్మి, శ్రీనివాస్, దీప్తి, రుక్మిణీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నెల 26వేల టన్నుల రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, గోదుమలు, చక్కెర, కిరోసిన్ సబ్సిడీ కిందా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు చెందాల్సిన సబ్సిడీ సరుకులు నల్లాబజారులో ఎవరైన విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని పాఠశాలలో సక్రమంగా బియ్యం అందడం లేదనే ఫిర్యాదులు అందాయని అలాంటివి ఎక్కడ జరుగకుండా చూడాలని ఆదేశించారు. సరుకుల పంపిణీ పాఠశాల నడిచే సమయంలోనే చేయాలని కోరారు. అనంతరం ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్‌ఇ, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, రమణలతో కూడా చర్చించారు. ఈసారి నాన్ సిఆర్‌ఎఫ్ క్రింద జిల్లాలో నీటి సమస్య ఉన్న గ్రామాలను, నగర శివారులోని బస్తీలను గుర్తించి నిధులు మంజూరుకు ప్రణాళికను పూర్తిచేయాలని సూచించారు.

17న మొదటి విడత పల్స్ పోలియో

హైదరాబాద్, జనవరి 8: జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి ఈ నెల 17న మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమంలో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టరు ఆమ్రపాలి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేటులో పల్స్‌పోలియో కార్యక్రమంపై జిల్లా టాస్క్‌పోర్స్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో 7 లక్షల 11వేల మంది ఐదు సంవత్సరములలోపు పిల్లలను గుర్తించడం జరిగిందని వీరందరికి ఈ నెల 17న మొదటి విడతగా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని భవన నిర్మాణ ప్రాంతాలు, ఇటుకబట్టీలు, మురికివాడల్లో నివసించే ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె అన్నారు. స్వయం సహాయక సంఘాలు, ఆశా, అంగన్‌వాడి కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
జిల్లాలో మొత్తం 2793 పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1592 కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో 1201 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందుకుగాను 11,172 మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆమె తెలిపారు. 66 సంచార బృందాలు, 58 ట్రాన్సిట్ బృందాలు, 68 ప్రచార వాహనాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె తెలిపారు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కూడా పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 17న పోలియో చుక్కలు వేయించుకోని వారికి ఈ నెల 18, 19 తేదీల్లో ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. అన్ని పోలియో కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించడంతోపాటు వారికి శిక్షణనిచ్చే ఏర్పాట్లను పూర్తిచేయాలని ఇమ్యునైజేషన్ అధికారికి జేసి సూచించారు. ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భానుప్రకాష్, జడ్పీ సిఇఓ రమణారెడ్డి, డిఆర్‌డిఎ పిడి సర్వేశ్వర్ రెడ్డి, డిఇఓ రమేష్, డిఇఓ గణేష్‌రావు, వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అందించేందుకు కృషి

ఖైరతాబాద్, జనవరి 8: నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అందించేందుకు కృషి చెద్దామని ట్రాన్స్‌కో6 సి ఎండి ప్రభాకర్ రావు పిలుపు నిచ్చారు. శుక్రవారం విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్ సౌదాలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్ట్ఫా అసోసియేషన్ డైరీని, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగ ఫలం, ముఖ్యమంత్రి కెసి ఆర్ ఉద్యమ సారథ్యంలో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి ఏడాదే విద్యుత్ సమస్యలు లేకుండా చూడటంలో ఉద్యోగులు ఎంతో శ్రమించారని అన్నారు. సాంకేతితలో అభివృద్ధి సాధించడంతో రోజుకు రూ. 2కోట్లు ఆదా అవుతుందని, అదే తరహాలో ఖర్చును తగ్గించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సంస్థను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఏ స్థాయి ఉద్యోగి సలహాలనైనా పరిగణనలోనికి తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో యూనియన్ల సహకారం తీసుకుంటామని చెప్పారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని సిఎం కేసిఆర్‌కు విన్నవించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు రఘుమారెడ్డి, సచ్చిదానందం, రఘు, శివాజీ, అసోసియేషన్ అధ్యక్షుడు హరీష్ చంధ్రశేఖర్, ఈశ్వర్ గౌడ్, అశోక్, వెంకటేశ్వర్లు, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

10న సహజ యోగ ఇన్నర్ పీస్ ఫెస్టివల్

ఖైరతాబాద్, జనవరి 8: సహజయోగ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10న రవీంద్రభారతిలో సహజ యోగ ఇన్నర్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు సంస్థ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ బ్రహ్మచారి తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్న మానవుడు నిత్యం ఒత్తిడితో జీవిస్తున్నాడని అన్నారు. కనీసం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే సమయం సైతం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. యోగా సాధనతో ప్రస్తుత మానవుడు ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చునని తెలిపారు. 1970వ సంవత్సరంలో శ్రీమాతాజీ నిర్మలాదేవి మానవాళి మనుగడను సులభతరం చేసేందుకు ఈ సహజ యోగాను ప్రారంభించారని చెప్పారు. ఉత్సవాలను పురస్కరించుకొని రవీంద్రభారతిలో సంగీత విభావరిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన మన దేశంలో యోగను అభ్యసించే వారు తక్కువ కావడం ఎంతో ఆవేదన కలిగిస్తోందని అన్నారు. సుబ్రహ్మణ్యం, సిబ్బిరెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.