హైదరాబాద్

ఎలా చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: చిన్నపాటి వర్షాలకే కొట్టుకుపోయే నగరంలోని రోడ్లకు శాశ్వత ప్రాతిపదికన చికిత్స చేసేందుకు తొలి దశలో 64 ప్రాంతాల్లో వంద కిలోమీటర్ల వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారుల క్షేత్ర స్థాయి పర్యటనలను మొదలుపెట్టారు. ఇదివరకే వైట్‌టాపింగ్ రోడ్లను నిర్మించేందుకు గుర్తించిన ప్రాంతాల్లో సోమవారం బృందం పర్యటించి వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణం ఎలా చేపట్టాలి? ఎక్కడెక్కడ చేపట్టేందుకు అనుకూలమైన, ప్రతికూలమైన పరిస్తితులన్నాయన్న విషయంపై అధికారుల కసరత్తు ప్రారంభించారు. అసలే ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి ఆదేశాలు కావటంతో ఇప్పటి వరకు రోడ్లు నిర్మించిన విధంగా కాకుండా ఈ సారి కాస్త పకడ్బందీగా నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా అధికారుల బృందం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు లిబర్టీ, బషీర్‌బాగ్, ఆబిడ్‌స, చార్మినార్, అలియాబాద్, చాంద్రాయణగుట్ట, డబీర్‌పురా, సైదాబాద్, డిఆర్‌డిఎల్, కంచన్‌బాగ్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో తొలగించాల్సిన మంచినీటి, సీవరేజీ పైప్‌లైన్లు, విద్యుత్ లైన్లు ఏ మేరకు ఉన్నాయి? వాటిని అక్కడి నుంచి తొలగించి మరో చోట ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అంతేగాక, వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణం చేపడితే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసినట్లు వెల్లడించారు. ఒకే సారి వంద కిలోమీటర్ల మేరకు వైట్‌టాపింగ్ రోడ్లు నిర్మిస్తే ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు మార్గాన్ని అనే్వషిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు గాను ప్రతి రోడ్డు మార్గానికి పూర్తి స్తాయి ప్రాజెక్టు రిపోర్టు రూపొందించాలని జిహెచ్‌ఎంసి ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. దీర్ఘకాలిక అవసరాకు అనుగుణంగా ఉండే మంచినీటి సరఫరా, సీవరేజీ పైప్‌లైన్లను వేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, వ్యాపార, వాణిజ్య సంస్థ ట్రేడ్‌లైసెన్సులను తనిఖీ చేశారు. మార్గమధ్యలో రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేయాలని ఆదేశించారు. అలియాబాద్‌లో రోడ్డు పక్కన ఉన్న బియ్యం దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్సును చూపించాలని కమిషనర్ ప్రశ్నించగా, యజమానికి లేదని సమాధానమివ్వటంతో ఆయా ప్రధాన రహదారి వెంట ఉన్న దుకాణాలన్నిటిని తనిఖీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు అప్పటికపుడు ట్రేడ్‌లైసెన్సును అందజేశారు. ఇక్కడున్న దుకాణాలన్నింటికి ట్రేడ్ లైసెన్సులు జారీ చేసేందుకు గాను వెంటనే నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేవించారు. జలమండలి అధికారి రామేశ్వర్‌రావు, ట్రాన్స్‌కో అధికారి సతీష్ల్ పాల్గొన్నారు.