హైదరాబాద్

‘నరుూం’ బినామీలెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: చీకటి సామ్రాజ్యానికే డాన్‌గా పేరుగాంచిన నరుూం బినామీలెవ్వరు? అన్న కోణంలో సైతం పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌లో నరుూం హతమైనప్పటి నుంచి పోలీసులు నరుూం వ్యవహారంపై విచారణను వేగవంతం చేశారు. అయితే ఇప్పటికే నగరంలోని కొందరు రాజకీయ, పారిశ్రామిక ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని కూడా విచారించే అవకాశముండటంతో, నరుూం హతమైన తర్వాత కూడా బాధితులకు భయం తప్పటం లేదు. తాజాగా శివార్లలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు నరుూం గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు, ఓ భూవివాదానికి సంబంధించి ఎమ్మెల్యే రూ. 3 కోట్ల లావాదేవీ జరిపినట్లు పోలీసు గుర్తించినట్లు తెలిసింది. అంతకు ముందు నరుూం బినామీగా ప్రచారమైన వనస్థలిపురంకు చెందిన శ్రీ్ధర్‌గౌడ్‌కు ఏడాది కాలంగా నరుూంతో సత్సంబంధాలున్నట్లు గుర్తించిన పోలీసులు, ఈ రకంగా నగరంలో ఇంకెంత మంది ఉన్నారోనన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కేవలం రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లోనే గాక, వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలకమైన విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వారు, నేటికీ పదవుల్లో ఉంటూ నరుూంకు ఆశ్రయమిస్తూ, ఆయన బినామీగా కొనసాగుతున్న వారి గుట్టురట్టు చేసేందుకైనా గతంలో నరుూం ఆగడాలకు బలైన బాధితులను విచారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. గజం స్థలం తులం బంగారం కన్నా ఎక్కువ విలువ చేసే కొండాపూర్‌లో నరుూంకు 69 ఎకరాల స్థలం ఉన్నట్లు మంగళవారం పోలీసుల సోదాల్లో బయటపడిందంటే ఆ భూమి ఎలా వచ్చింది? వాటికి అసలు యజమానులెవరు? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఏకంగా 70 ఎకరాల స్థలం ఖాళీగా లేదు. అయితే నరుూం ఇంట్లో లభ్యమైన ఈ స్థలం తాలుకు డాక్యుమెంట్ ప్రకారం ఈ స్థలంలో నిర్మితమైన భవనాల యజమానులను పోలీసులు విచారించే అవకాశం లేకపోలేదు. ఉప్పల్ కళ్యాణ్‌పూర్‌లోని ఓ ప్రముఖ రాజకీయ నేతకు సంబంధించిన స్థలంలో కూడా నరుూం జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ స్థల వివాదం కారణంగానే పట్లోళ్ల గోవర్థన్‌రెడ్డిని నరుూం హత్యం చేసి ఉంటాడన్న చర్చ వాడీవేడిగా జరుగుతోంది. సికిందరాబాద్ పాత గాంధీ ఆసుపత్రికి సమీపంలోనున్న నరుూం బంధువుల నగల దుకాణం యజమానిని కూడా విచారించనున్నట్లు సమాచారం. ఈ దుకాణం యజమానికి గతంలో నరుూం రూ. 5లక్షలు డిమాండ్ చేసినట్లు, డెడ్‌లైన్ లోపు ఇవ్వకుంటే మరుసటి రోజు నుంచి రోజుకీ అదనంగా రూ. 5లక్షలు చెల్లించాలని నరుూం అల్టిమేటం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.