హైదరాబాద్

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: ఒక దేశ నాగరికత వికాసానికి, సంస్కృతి ఔన్నత్యానికీ ఉత్తమ మానవ సంస్కార నిర్మాణానికి గీటు రాళ్లు గ్రంథాలయాలు అని గురువారం ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన జాతీయ గ్రంథాలయ పాలకుల దినోత్సవంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. గ్రంథాలయాలు అంటే కేవలం గ్రంథ సేకరణ కేంద్రాలు మాత్రమే కాదని, విజ్ఞాన భాండాగారాలని, సమకాలీన అత్యాధునిక సమాజంలో గ్రంథపాలకుల పాత్ర విశిష్టమైనదని, బహుముఖీనమైనదని వారు పేర్కొన్నారు. ఉస్మానియా గ్రంథాలయ విభాగాధిపతి ప్రొఫెసర్ వి విశ్వమోహన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆర్ట్సు కాలేజీ ప్రధానాచార్యుడు ప్రొఫెసర్ నాయుడు అశోక్ మాట్లాడుతూ ప్రచార సాధనాల విజృంభనలో గ్రంథపాలకుల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. డిజిటలైజేషన్ యుగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని నేడు సమర్ధవంతంగా వినియోగించుకుంటూ విశ్వసమాచారాన్ని క్షణాల్లో అందించగలుగుతున్నారని అన్నారు. డాక్టర్ పి దివాకర్, డాక్టర్ కె భారతి, డాక్టర్ జె వివేకవర్ధన్, డాక్టర్ ఆర్‌కె పవన్‌కుమార్, డాక్టర్ యాదగిరి పాల్గొన్నారు.