హైదరాబాద్

మళ్లీ మొదటికి తడిసి మోపెడవుతున్న బల్దియా ‘రవాణా’ వ్యయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది గ్రేటర్ అధికారులు ఆలోచనా విధానం. చెత్తను తరలించే వాహనాల మర్మతుల కోసం ప్రతి నెల రూ. 2 కోట్లు ఖర్చవుతున్నాయని, అందులో ఎక్కువ శాతం నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తటంతో ఏ మాత్రం ముందు వెనకా ఆలోచించకుండా అధికారులు చెత్త తరలింపును జోన్లు, సర్కిళ్లకు వికేంద్రీకరణ చేయటంతో సకాలంలో చెత్త తరలింపు మాట దేవుడెరుగు కానీ ప్రతి నెల ఖర్చవుతున్న రెండు కోట్లకు బదులుగా నాలుగు నుంచి అయిదు కోట్ల వరకు ఖర్చు కావటంతో కంగుతిన్న అధికారులు తాము తీసుకున్న నిర్ణయంపై మరో సారి పునరాలోచించుకుంటున్నారు. ఈ క్రమంలో చెత్త తరలింపును మళ్లీ వికేంద్రీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న చెత్త తరలించే వాహనాల్లో 15 ఏళ్లు దాటిన మరో వంద వాహనాలను స్క్రాప్ కింద విక్రయించాలని ఇటీవలే స్థారుూ సంఘం చేసిన తీర్మానాన్ని అధికారులు అమలు చేయకుండా పక్కనబెట్టినట్లు తెలిసింది. మహానగరంలో ప్రతిరోజు పేరుకుపోయే చెత్తను ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు, అక్కడి నుంచి శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించే ప్రక్రియ అధికారులకు ఒకరకంగా తలభారంగా మారిందనే చెప్పవచ్చు. గతంలో ప్రధాన కార్యాలయంలోని రవాణా విభాగం పర్యవేక్షణలో చెత్త సేకరణ, తరలింపు విధులు జరిగేవి.
అయితే ఇందులో భారంగా అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ తరుచూ ఆరోపణలు రావటంతో గత ఏప్రిల్ 6వ తేదీన కమిషనర్ జనార్దన్ రెడ్డి చెత్త తరలింపు విధులను ఎక్కడిక్కడే జోన్లు, సర్కిళ్లకు వికేంద్రీకరిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. కానీ రవాణా విభాగం కేంద్రీకరించి ఉన్నపుడు అయ్యే వ్యయం ఇపుడు వికేంద్రీకరించిన తర్వాత నాలుగైదింతలు పెరగటం అధికారులను ఒకింత ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది. అంతేగాక, కమిషనర్ ఈ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న ఏప్రిల్ 6వ తేదీ నుంచి నేటి వరకు కూడా నగరంలో ఎక్కడా కూడా ప్రతిరోజు పూర్తి స్థాయిలో చెత్తను తొలగించటం లేదు. ఈ నిర్ణయం తీసుకున్న కొత్తలో కూడా ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోవటంతో నేరుగా జోనల్, అదనపు కమిషనర్లు రంగంలో దిగి, అద్దె వాహనాలను ఎంగేజ్ చేస్తే తప్ప, చెత్త తరలింపు సాధ్యపడలేదు. అదీ అంతంతమాత్రమే. అంతటితో ఆగని అధికారులు రవాణా విభాగంలో 15 ఏళ్లు దాటిన దాదాపు వాహనాల్లో దాదాపు వంద పై చిలుకు వాహనాలకు ఆర్టీఏకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి, మళ్లీ అయిదేళ్ల పాటు రాకపోకలు సాగించే అవకాశమున్నా, ఆ దిశగా అధికారులు దృష్టి సారించకుండా, వికేంద్రీకరణ వల్ల లాభమెంత? నష్టమెంత? అన్నది అంఛనాలు వేయకుండానే తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో రవాణా విభాగాన్ని జోన్లు, సర్కిళ్ల వారీగా వికేంద్రీకరించిన తర్వాత చెత్తను తరలించేందుకు జోనల్, డిప్యూటీ కమిషనర్లు ఎవరెన్ని వాహనాలను ఎంగేజ్ చేస్తున్నారన్నది అంతుచిక్కకుండా తయారైంది. అప్పటికే సర్కిళ్ల వారీగా ఉన్న డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు అనేక రకాల అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న సమయంలో ఈ ప్రక్రియను వికేంద్రీకరణ చేయటం, అవసరమైన స్థాయిలో అద్దె వాహనాలను ఎంగేజ్ చేసుకోమని కమిషనర్ జారీ చేసిన ఆదేశమే నేడు చెత్తరవాణా వ్యయం నాలుగింతలు పెరిగేందుకు ప్రధాన కారణమైందని చెప్పవచ్చు.