హైదరాబాద్

మచ్చబొల్లారంలో కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, ఆగస్టు 12: అల్వాల్ మున్సిపల్ పరిధిలోని మచ్చబొల్లారం మార్కెట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున వేగనార్, వెర్నా కారుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు మచ్చబొల్లారం మార్కెట్ వద్ద రెడ్డి వైన్స్ సమీపంలో ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు నాలుగు రౌండ్లు కాల్పులు జరుపుకుని పరారయ్యారు. ఆలస్యంగా విషయం తెలియటంతో అల్వాల్ పోలీసులు రంగప్రవేశం చేసి సిసి కెమెరాల ఫుటేజి పుటేజి ద్వారా కారు నెంబర్లు కనుక్కొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఒక బుల్లెట్ లభ్యమైనట్టు తెల్సింది.