హైదరాబాద్

జలమండలి లైన్‌మెన్‌లకు మొబైల్ యాప్‌పై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: జలమండలి సేవలు మరింత విస్తరించేందుకు మోబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. జలమండలిలో పనిచేస్తున్న వాటర్ లైన్‌మెన్‌లు, సివరేజీ సిబ్బందికి జలమండలి నూతనంగా సెల్‌ఫోన్లను అందిస్తొంది. ఈ ఫోన్‌లో ఉన్న తొమ్మిది అంకెలకు సంబంధించి ఒక్కొక్క నెంబర్‌కు వేరు వేరుగా క్లోరిన్, వాల్వ్ లీకెజీ, పైప్ లీకెజీ, కలుషిత నీటి సరఫరా, సివరేజీ ఓవర్‌ఫ్లో, మిస్సింగ్ మ్యాన్ హోల్ కవర్, నాన్ రిసిప్ట్‌బిల్, మీటర్ రిక్వేస్ట్, అక్రమ నీటి కనెక్షన్‌కు సంబంధించిన ఉమాచారంను స్థానికంగా ఉన్న సెక్షన్ మేనేజర్‌తో పాటు లైన్‌మెన్‌లకు వెంటనే అంధించేందుకు వీలుండే విధంగా రూపొందించారు.
జలమండలి మెయింటనెన్స్, ఆపరేషన్ విభాగంలో పనిచేస్తున్న వాటర్, సీవరేజీ సిబ్బందికి అందజేస్తున్న ఈ ఫోన్లను వాడే విధానం తదితర అంశాలపై ఖైర్‌తాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో శుక్రవారం అవగాహన శిబిరం నిర్వహించారు. ఎండి దానకిషోర్ మాట్లాడుతూ జలమండలి పరంగా ఏటువంటి వినియోగదారులకు ఎటువంటి సమస్యలు కలిగిన వెంటనే పరిష్కరించేందుకు ఈ ఫోన్‌లు ఎంతో ఉపయోగకారంగా ఉంటాయని అన్నారు. బోర్డు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఆండ్రాయిడ్ ఫోన్‌లను అనుసంధానం చేసి ఎంసిసికి వచ్చే ఫిర్యాదులను సంబంధిత లైన్‌మెన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడంతో ఫిర్యాదుదారుడిచ్చిన సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.
జలమండలిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కిలిసి కట్టుగా పనిచేసి నీటి బిల్లులను సకాలంలో వసూళ్లు చేసి ప్రతి నెల రూ. 150 కోట్లు రెవిన్యూను అధిగమించేలా కృషి చేయలని అన్నారు. జలమండలి వాటర్, సివరెజీ విభాగంలో పనిచేస్తున్న రెండువేల మంది లైన్‌మెన్‌లకు త్వరలో మంత్రి కెటిఆర్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను అందజేస్తారని తెలిపారు. 40 ఫోన్‌లను ట్రాయల్ బెసీస్ కింద శుక్రవారం జలమండలి కార్యాలయంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇడి ఎం.సత్యనారాయణ, ఇఎన్‌సి డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, ఫైనాన్స్ డైరెక్టర్ టి.రవింధర్‌రెడ్డి, జి.రామేశ్వరరావు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో