హైదరాబాద్

ఆశలు.. అడియాసలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: జిహెచ్‌ఎంసి ఎన్నికల డివిజన్ల రిజర్వేషన్లపై దాదాపు అన్ని పార్టీలకు చెందిన సామాన్య కార్యకర్తలు మొదలుకుని, ఇప్పటి వరకు పలు పర్యాయాలు కార్పొరేటర్లుగా వ్యవహారించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. 2009 నుంచి 2014ల మధ్య కొనసాగిన గ్రేటర్ మొట్టమొదటి పాలక మండలిలో కీలకమైన పదవులను చేపట్టి, అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరి మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లపై కనే్నసిన నేతలకు సైతం ఈ రిజర్వేషన్లు ఇరకాటంలోకి నెట్టాయి. ఈ రకమైన పరిణామాలు సైదాబాద్, రాంగోపాల్‌పేట, అహ్మద్‌నగర్, కవాడిగూడ వంటి డివిజన్లలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. అంతేగాక, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, గత సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కొందరు యువకులు, వ్యాపారులు, ఇంజనీర్లు, డాక్టర్లు,లాయర్లు వంటి ప్రొఫెషనల్స్ సైతం రాష్ట్రం సిద్దించిన తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాల్లో భాగంగా మంత్రులు చుట్టు ప్రదక్షిణలు సైతం చేశారు. వారంతా ఆయా డివిజన్లను ఎంపిక చేసుకుని, పలు కార్యక్రమాలను కూడా నిర్వహించి ప్రజల్లోకి వెళ్లారు. తీరా రిజర్వేషన్లు ఖరారు కాగానే వారు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో నిన్నమొన్నటి వరకు పలువురు నగర మంత్రుల చుట్టు తిరిగి నేతలు సైతం ఇపుడు పత్తాలేకుండా పోయారు. వారు ఎంచుకున్న డివిజన్, వారు ఊహించుకున్న సామాజికవర్గానికి దక్కకపోవటంతో ఇక తాము పోటీ చేసేదే లేదంటూ కొందరు అజ్ఞాతంలోకి వెళ్లగా, మరికొందరు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ రకంగా మహిళలకు రిజర్వు అయిన డివిజన్లలోని కొందరు నేతలను పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బుజ్జగిస్తూ తమ కుటుంబ సభ్యులను బరిలో దించితే, తాము గెలిపిస్తామంటూ భరోసా ఇస్తున్నా, బరిలో నిలిచేందుకు ముందుకు రావటం లేదు. మరికొందరు తమ భార్యలను పోటీలో నిలిపేందుకు ఇష్టపడక పార్టీలకు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా, టిడిపి, బిజెపి పార్టీలకు చెందిన ఆశవాహుల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సీట్ల సర్దుబాటులో భాగంగా తమ డివిజన్ సీటు తమకు దక్కుతుందా? మిత్రపక్షం పార్టీ ఖాతాలోకి వెళ్తుందా? అన్న విషయంపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక వేళ మిత్రపక్షం పార్టీ ఖాతాలోకి తన సీటు వెళితే ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం.