హైదరాబాద్

ఎల్‌ఇడి బల్బులు వచ్చేశాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, ఆగస్టు 12: ఎల్‌ఇడి టివి, కంప్యూటర్‌లు అందరికీ సుపరిచితమే. ఇప్పుడు నగరంలోకి ఎల్‌ఇడి బల్బులు వచ్చేశాయ్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సరఫరా కాబడే ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఎల్‌ఇడి బల్బులు గ్రేటర్‌లో మొదటిసారిగా ట్రాన్స్‌కో సౌత్ జోన్ పరిధిలోని సైదాబాద్ డివిజన్‌లో విక్రయానికి పెట్టగా అరగంటలో వెయ్యి ఎల్‌ఇడి బల్బులు అమ్ముడుపోయాయి. మరో పదివేల బల్బులైనా కొనేందుకు వచ్చిన పరిసర కాలనీవాసులు బల్బులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కొంతకాలంగా నగరంలో పలు చోట్ల గ్రేటర్, ట్రాన్స్‌కో అధికారులు ఈ ఎల్‌ఇడి బల్బుల వాడకం ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా అమ్మకాలు జరుగలేదు. సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతాశ్రీనివాస్‌రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించడంతో మొదటిసారి ఎల్‌ఇడి బల్బుల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సాధారణ, ఫ్లోరోసెంట్ బల్బుల కంటే ఎన్నో విశిష్టత ప్రత్యేకతలున్న ఎల్‌ఇడి బల్బులను భారీ సబ్సిడీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తం భాగస్వామ్యంలో అందజేస్తున్నాయి. ఆసక్తి గల కాలనీవాసులు సంక్షేమ సంఘాలతో తమను సంప్రదిస్తే యాభైవేల బల్బులను ఆర్డర్‌కు ఒక్కో బల్బును రూ.80కు అందజేస్తారు. విద్యాసంస్థలు తదితర వాణిజ్య విభాగాలవారు పదివేల బల్బులు ఆర్డర్ ఇస్తే ఒక్కొక్క బల్బుకు రూ.85నుంచి రూ.90 వరకు ధర అందిస్తారు.
ఎల్‌ఇడి బల్బుల ప్రత్యేకతలు
* చేతి నుంచి జారిపడినా పగులవు. ఎల్‌ఇడి బల్బు జీవితకాలం 23సంవత్సరాలు.
* వెలుతురు ఎక్కువగా ఉంటుంది. పాత 60వాట్స్ ఉన్న స్థానంలో 9వాట్స్ బల్బు సరిపోతుంది.
* లోఓల్టేజీలో కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
* ప్రత్యేక వైరింగ్ అవసరం లేదు. పాత వాటి స్థానంలోనే అమర్చుకోవచ్చు.
* నెలసరి విద్యుత్తు బిల్లు సగానికిపైగా ఆదా అవుతుంది.
* అన్నివర్గాల వారికి అందుబాటు ధరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జిహెచ్‌ఎంసి సౌజన్యంతో అందజేస్తుంది.
విద్యుత్ ఆదా
ఉత్పత్తితో సమానం
విద్యుత్తును ఆదా చేయడం అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో సమానమని జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సైదాబాద్ డివిజన్ ఎస్‌బిహెచ్-ఎ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఎల్‌ఇడి బల్బుల అవగాహన, అమ్మకం కేంద్రాన్ని కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎల్‌ఇడి బల్బుల వాడకంపై అవగాహన పెంచుకొని వాటిని ఇళ్లలో అమర్చుకోవాలని సూచించారు. ఎల్‌ఇడి బల్బుల వాడకం ద్వారా అందరికీ వ్యక్తిగత లాభమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందించిన వారవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సౌత్‌జోన్ విద్యుత్ శాఖ అధికారులు హంపీరావు, కోటేశ్వర్‌రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.