హైదరాబాద్

మహిళలకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: ముస్లిం, మైనార్టీ మహిళలకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేసి మహిళా వైద్యులను నియమించాలని పబ్లిక్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్‌బి అలీ హజ్రామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముస్లిం, మైనార్టీ ఇంక్వైరీ కమిషన్ చైర్మన్ జి సుధీర్‌కు ఒ మెమోరాండం సమర్పించారు. మహిళలకు ప్రత్యేక ఆసుపత్రితోపాటు చికిత్స, ప్రసూతి, శస్త్ర చికిత్సలు మహిళా డాక్టర్లచే జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూ ట్రాన్స్‌లేటర్లను నియమించాలని, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం, మైనార్టీలకు రూ. 5లక్షల వడ్డీలేని రుణ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పాతికేళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న పబ్లిక్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ విజ్ఞాపన మేరకు ఇంక్వైరీ కమిషన్ చైర్మన్ మహిళలకు ప్రత్యేక ఆసుపత్రి నెలకొల్పేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నట్టు ఆయన మెమోరాండంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంక్వైరీ కమిషన్ చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం రుణ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు డాక్టర్ హెచ్‌బి అలీ హజ్రామి తెలిపారు.