హైదరాబాద్

గౌడ్‌లు ఆత్మపరిశీలన చేసుకుని సమైక్యతతో సాగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: ఆత్మస్థయిర్యంతో నిలబడగలిగిన ప్రతి గౌడ్ సర్వాయి పాపన్న అని, ప్రతి విషయానికి ప్రభుత్వ సహాయం అడిగే పద్ధతి మానుకుని తమ ప్రాంత ప్రజలతో కలిసి సమైక్యతతోసాగాలని, ఎవరి ప్రాంతాలలో వారే చందా వేసుకుని పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 366వ జయంతి కార్యక్రమంలో గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గౌడ్‌ల సమైక్యతను చూసి మొరిగే కుక్కలకు భయపడనవసరం లేదని ఆయన అన్నారు. పాపన్నగౌడ్ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని, విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అడిగేముందు గౌడ జాతికి తాను ఏం చేసానని ఆత్మవిమర్శ చేసుకోవాలి. గౌడ్‌లలో సమైక్య భావం వుంటే ఆడిటోరియంలో ఎందుకు ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. గౌడ్‌లలో కుతంత్రాలు రేపేవారిని ఎదుర్కొని వెనుకబడి వున్నవారినందరినీ కలుపుకుని వెళదామని, అందరూ ఏకమై సమిష్టిగా అభివృద్ధి సాధించాలని, మొక్కలు నాటేవారు మీ ప్రాంతంలో తాటి, ఈ చెట్లు నాటాలని భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ గీతాల సిడి, సర్వాయిపాపన్న చరిత్ర పుస్తకాన్ని స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మల్లేశంగౌడ్, రమేష్‌బాబుగౌడ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.