హైదరాబాద్

మెరుగైన సేవలందించేందుకు కృషి : మేయర్ బొంతు రామ్మోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: మహానగర వాసులకు మరింత మెరుగైన సేవలందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రతి ఉద్యోగి, అధికారి కూడా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలకు మేయర్ రామ్మోహన్ హజరయ్యారు. తొలుత ఆయన డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డిలతో కలిసి జాతీయ పతాకాన్న ఎగురవేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్య్రమని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలో వౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. అంతేగాక, ప్రస్తుతం నగర పౌరులకు అందిస్తున్న సేవలన్నింటిని కూడా మరింత మెరుగ్గా, అంకితాభావంతో అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన ‘మై జిహెచ్‌ఎంసి’ మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఆయన ఐటి విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నగరంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన అవసరముందన్నారు. ఇందులో భాగంగానే గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా పది కొలనులను నిర్మిస్తున్నట్లు మేయర్ తెలిపారు. నగరంలో పచ్ఛదనం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో రికార్డు స్థాయిలో మొక్కలు నాటినట్లు ఆయన గుర్తు చేశారు. మెరుగైన రవాణా వ్యవస్థ కోసం ఫ్లై ఓవర్లు, ఫుటోవర్ బ్రిడ్జిలు వంటి నిర్మాణాలు చేపట్టినట్లు మేయర్ వివరించారు. అనంతరం కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఆర్థిక వనరులను పెంపొందించేందుకు మరింత కృషి చేయాలని సిబ్బంది, అధికారులకు సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుమారు రూ. 38 కోట్లను 1693 స్వయం సహాయక బృందాలకు బ్యాంకు లింకేజీ రుణాలుగా అందజేసినట్లు తెలిపారు. అంతేగాక, ఉద్యోగ నియామకపత్రాలు, 24 వీల్‌చైర్లు, 96 వాకింగ్ స్టిక్‌లు, పది మందికి ఆసరా కార్డులను అందజేయటంతో పాటు అత్యుత్తమ సేవలందించిన 19 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేసినట్లు కమిషనర్ తెలిపారు.