హైదరాబాద్

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రక్షాబంధన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, ఆగస్టు 17: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే రక్షా బంధన్ పండుగ సమీపిస్తోంది.
ఒక కొమ్మను పూచిన రెండు పూల మాధిరి, ఒకే పేగుబంధాన్ని పంచుకుని పుట్టిన అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, అనురాగానికి ప్రతీక రక్షాబంధన్. తన సోదరుడు తన జీవితాంతం తనకు రక్షగా ఉండాలని ఆకాంక్షిస్తూ, తానెక్కడున్నా, ఏడాదికొక్కసారి అన్న ఇంటికొచ్చి ఎంతో ప్రేమగా రాకీ కట్టి, ఆశీర్వాదం తీసుకునే అక్కా, చెల్లెళ్ల పండుగే రక్షా బంధన్. మనం రాకీ పండుగ జరుపుకునేందుకు ఎన్నో చారిత్రక కథనాలున్నాయి. రోజురోజుకి ఆధునికత పెరిగిపోతున్నా, చెల్లెళ్లు అన్నలు, తమ్ముళ్లకు రాకీలు కట్టాలన్న సంస్కృతీ నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం భారత సంస్కృతి ఔన్నత్యానికి గొప్ప నిదర్శనం. ఒక పేగును తెంచుకుని పుట్టకపోయినా, వరుసలు కలిసిన సోదరీసోదరులు సైతం ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుని మానవ విలువల ప్రాధాన్యతను చాటుతున్నారు.
అంతేగాక, క్షణికావేశంలో ఊహించని నేరం చేసి జైలు జీవితం గడుపుతున్న ఖైదీలకు సైతం యువతులు ఈ రాకీలు కట్టి తమ ఉదారతను చాటుకుంటారు. అన్ని వర్గాల ప్రజలు తమ ఆర్థిక స్తోమతకు తగిన విధంగా జరుపుకునేందుకు మార్కెట్‌లో యాభై పైసల విలువ చేసే పూజా రాకీ మొదలుకుని వేలాది రూపాయల విలువ చేసే బంగారు, వెండి రాకీలు కూడా అందుబాటులో ఉన్నాయి. రక్షాబంధన్ పండుగ ఈ నెల 18వ తేదీనా ఉన్నా, ఈ సారి కాస్త ముందుగానే రాకీల కొనుగోళ్లు ఊపందుకోవటం విశేషం. రాకీ ధరను పక్కనబెట్టి, ఎంతో ప్రేమతో చెల్లి చేయితో రాకీ కట్టించుకుని, ఆమె సంతోషపడేలా నజరానా అందించేందుకే సోదరులు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతి సంవత్సరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించే రాకీల్లో సుమారు యాభై శాతం నగరంలోని దూల్‌పేట, బేగంబజార్‌లలో తయారు కాగా, మిగిలిన మరో యాభై శాతం రాకీలు రాజస్థాన్, మహారాష్ట్ర, దిల్లీ, హర్యానా ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రతి ఏటా వీటి డిమాండ్‌ను బట్టి వ్యాపారులు కొద్ది నెలల ముందే ఆర్డర్ ఇచ్చి మరీ వీటిని తెప్పించుకుంటున్నారు.
పత్తి, చకీ, దారం, పూసలతో పాటు పనికిరాని చిత్తుకాగితాలు, అట్టలతో రాకీలు తయారు చేసే వారు. కానీ కొద్ది కాలంగా వెండి, బంగారంతో పాటు కరెన్సీ నోట్లతో కూడా తయారు చేసిన రాకీలు అందుబాటులో ఉంటున్నాయి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ధనికవర్గాలు వెండి, బంగారం, కరెన్సీ నోట్లతో తయారైన రాకీలను ఎంతో మక్కువతో కొనుగోలు చేస్తుంటారు. మొత్తానికి రాకీ రేటు ఎంత అన్నది ముఖ్యం కాదు, దాన్ని కట్టేవారు సోదరులను ఎంత అభిమానిస్తారన్నదే ముఖ్యం.