హైదరాబాద్

సంక్షోభం దిశగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: మహానగర పాలక సంస్థ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. వర్తమాన సంసత్సరం రూ. 3500 కోట్ల వార్షిక బడ్జెట్‌ను రూపొందించుకున్న జిహెచ్‌ఎంసిపై మున్ముందు భారీ బడ్జెట్‌ల భారం పడే అవకాశమున్నందున ప్రభుత్వం, జిహెచ్‌ఎంసి అధికారులు మున్ముందు తలెత్తనున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు కాస్త ముందుగానే కళ్లు తెరిచారు. ఇప్పటికే నిర్మించి సిద్దంగా ఉన్న 27వేల వాంబే, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు వౌలిక వసతులను కల్పించేందుకు అవరమైన రూ. 440 కోట్లను హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ జిహెచ్‌ఎంసి ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదన పంపిన సంగతి తెలిసిందే! అంతేగాక, ఆదాయమార్గాలన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని భావించిన అధికారులు ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి ఇండోర్ స్టేడియంలు, ప్లే గ్రౌండ్స్‌లను సైతం అద్దెకిచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో మున్ముందు చేపట్టనున్న భారీ ప్రాజెక్టులకు నిధులెలా సమీకరించుకోవాలన్న అంశంపై సర్కారు స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. ముఖ్యంగా నగరంలో ప్రభుత్వం చేపట్టనున్న స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్( ఎస్‌ఆర్‌డిపి), లక్ష్యంగా పెట్టుకున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి ఇతర మరిన్ని కీలకమైన ప్రాజెక్టులకు నిధులు సమీకరించుకునే అంశంపై ఇప్పటి నుంచే దృష్టి సారించారు. అయితే బుధవారం అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ అంశంపై మున్సిపల్ మంత్రి కెటిఆర్ నిర్వహించిన సమీక్షలో పలు తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి రూ. వెయ్యి కోట్ల పై చిలుకు ఆస్తిపన్ను వసూలు చేసుకుంటున్న జిహెచ్‌ఎంసి గత కొద్ది సంవత్సరాలుగా ఆస్తిపన్నును ఏ మాత్రం పెంచకుండానే రెవెన్యూను పెంచుకుంటుంది. అయితే మున్ముందు ఆస్తిపన్ను కుదింపు చేస్తే మరింత ఆదాయం సమకూరే అవకాశముందని ఆర్థిక నిపుణులు మంత్రి కెటిఆర్‌కు సూచించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఏటేటా జిహెచ్‌ఎంసి వసూలు చేసుకుంటున్న ఆస్తిపన్ను పెరిగేందుకు నగరంలో విలీనమైన రంగారెడ్డి రెవెన్యూ జిల్లాలోని పనె్నండు మున్సిపాల్టీల్లో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ ఇందుకు వరంగా మారిందని చెప్పవచ్చు. కొత్తగా నిర్మితమవుతున్న భవనాల్లో ఆస్తిపన్ను పరిధిలోకి రాని వాటిని, ఎక్కువ స్థలం వినియోగిస్తూ రికార్డుల్లో తక్కువగా నమోదు చేసుకున్న ఆస్తులను గుర్తించి వాటిని కుదింపు చేయటం వంటి చర్యలతో గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో జిహెచ్‌ఎంసి లక్ష్యానికి తగిన విధంగా ఆస్తిపన్ను వసూలు చేసుకుంది. అయితే ఈ నెల 26వ తేదీ కల్లా ఎస్‌ఆర్‌డిపి సర్వే ముగిసి, ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభమయ్యే అవకాశమున్నందున, ఈ ఒక్క ప్రాజెక్టుకే జిహెచ్‌ఎంసి తొలి దశగా సుమారు రూ. 4వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. అంతేగాక, సిటీలో తొలుత లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలనుకున్నా, ప్రస్తుతం సిద్దంగా ఉన్న 77 మురికివాడల్లో 25వేల ఇళ్లను నిర్మించేందుకు అన్ని రకాల అడ్డంకులు తొలగినా, వీలైనంత త్వరగా ఆ పనులు చేపట్టాలని సర్కారు యోచిస్తోంది. ఈ క్రమంలో జిహెచ్‌ఎంసి ఖజానాలో ఉన్న నిధుల్లో దశల వారీగా చెల్లింపులు చేసినా, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికల్లా ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకు గాను అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునే అంశాన్ని కూడా బుధవారం కెటిఆర్ వద్ధ జరిగిన సమీక్షలో నిపుణులు మంత్రికి సూచించినట్లు తెలిసింది. జంటనగరాల ప్రజలకు అత్యవసర సేవలు, పౌర సేవలతో పాటు అవసరాలకు అనుకూలంగా అభివృద్ధిని చెపట్టడంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బల్దియా ఈ భారీ ప్రాజెక్టులకయ్యే వ్యయానికి తగినట్టు నిధులు సమీకరించుకునేందుకు వీలుగా ఆస్తిపన్ను పెంచుతుందా? లేక బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.