హైదరాబాద్

అన్నాచెల్లెళ్ల అనురాగ‘బంధం’.. రక్షాబంధన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీక రక్షా బంధన్. తోబుట్టువులు ఎక్కడున్న రక్షాబంధన్ రోజు తన సోదరుల ఇంటికొచ్చి రాకీ కట్టి, ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీ. ఈ క్రమంలో గురువారం రాకీ పౌర్ణమిని పురస్కరించుకుని పండుగను నగరవాసులు సాంప్రదాయబద్దంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా పౌర్ణమి కావటంతో దైవదర్శనార్థం వచ్చిన భక్తులతో సికిందరాబాద్ శ్రీ గణపతి దేవాలయం, జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయంతో పాటు నగరంలో పేరుగాంచిన ఇతర దేవాలయాలు కూడా భక్తులతో కిటికిటలాడాయి. గురువారం ఉదయం నగరంలోని బేగంబజార్, మంగల్‌హాట్, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాకీ స్టాళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రాకీ వ్యాపారంలో లాభం ఎక్కువగా ఉండటంతో ఈ సారి గల్లీగల్లీలోనూ రాకీ దుకాణాలు దర్శనమిచ్చాయి. రక్షాబంధన్ కారణంగా సోదరుడికి రాకీ కట్టేందుకు రాకపోకలు సాగించే వారితో నగరంలోని పలు రహదార్లు ఉదయం కిటకిటలాడాయి. ఏ వాహనంపై చూసినా, ఫ్యామిలీ సీన్స్ దర్శనమిచ్చాయి. ఒక వర్గం ప్రజలు ఎంతో సాంప్రదాయబద్దంగా జరుపుకునే రాకీ పండుగను పాతబస్తీ, ముషీరాబాద్, లంగర్‌హౌజ్ పరిసర ప్రాంతాల్లో ఇరువర్గాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జరుపుకోవటం విశేషం. నగరంలోని సికిందరాబాద్, అమీర్‌పేటలోని రాకీ స్టాళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాకీలన్ని అమ్ముడు పోగా, బేగంబజార్, మంగల్‌హాట్ ప్రాంతాల్లోని స్టాళ్లు రాత్రి ఏడు గంటల వరకు కొనుగోలుదార్లతో కిటకిటలాడాయి. వీరిలో ఎక్కువ మంది గురువారం రాకీను కొనుగోలు చేసుకుని, మరుసటి రోజైన శుక్ర, శనివారాల్లో తమ సోదరులకు కట్టేందుకు తమ స్వస్థలాలకు తరలి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.
ఉప్పల్‌లో..
ఉప్పల్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు గురువారం ఉప్పల్ పరిసర ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లతో పాటు బోడుప్పల్, చెంగిచర్ల, పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్, కాచవానిసింగారంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కాచెల్లెళ్లు పుట్టినింటికి వచ్చి అన్నయ్య, తమ్ముళ్లకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించి సోదరభావాన్ని పంచుకున్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్‌కు సోదరి కళ్యాణి, మేడ్చెల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డికి ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ ఎం.అనలారెడ్డి రాఖీ కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. హైదరాబాద్ జిందాబాద్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రామంతాపూర్ రాజేంద్రనగర్ చౌరస్తాలో హైదరాబాద్ రెసిడెన్సియల్ ఫోరమ్ ఉప్పల్ సర్కిల్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ నేతృత్వంలో అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులచే రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భీష్మాచారి, జగన్‌మోహన్, వెంకన్న, లక్ష్మీదేవి, గౌరీ పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా గురువారం సాయిబాబ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లతో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ పురపాలక సంఘాల్లోని చెంగిచర్ల, పర్వతాపూర్, మేడిపల్లిలోని సాయిబాబ ఆలయాలలో తరలి వచ్చిన భక్తులు పూజలు నిర్వహించారు.
కంటోనె్మంట్ - అల్వాల్‌లో..
అల్వాల్: సోదరి సోదర బందానికి ప్రతీక రాఖీ పండగని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ చెప్పారు. గురువారం రాఖీ పండగ సందర్భంగా తెరాస ప్రధాన కార్యదర్శి గోట్టిముక్కల శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్‌కు స్వామిగౌడ్ సతిమణి రాఖీ కట్టారు. కుటుంబ బందంలో సోదర సోదరీ బందం విడదీయ్యలేనిదనీ ప్రతి పౌరుడు కుంటుంబ బందం లో ఉన్నవారేననీ వారందరు ప్రతి వారు ఒక్కరిని ఒక్కరు గౌరవిస్తే ఎలాంటి సమస్య రాదని చెప్పారు. బోయిన్‌పల్లిలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు చామకూర మల్లారెడ్డికి ఆయన సోదరిమనులు రాఖీ కట్టి సోదరి సోదర భావం చాటుకున్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి సోదరీమణులు కె.నాగమణి, జి.్భరతి, సి.కళావతి, ఎ.ప్రమీల పాల్గొన్నారు. కాకాగుడాలో కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి.సాయన్న నివాసంలో మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు రాఖీలు కట్టారు.
బాలానగర్‌లో..
బాలానగర్: రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా బాలానగర్ డివిజన్ పరిధిలొ గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాపీత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వద విద్యాలయా సోదరిమణులు స్థానిక కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్యను కలిపి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బి.కె.అనురాధ, బి.కె.సునీత, దొంతుల మల్లేష్, రామ్‌లకన్, బి.కె.సుధాకర్, మున్నా పాల్గొన్నారు.
చేవెళ్లలో..
చేవెళ్ల: అన్నాచెల్లెల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగను చేవెళ్ల మండలంలో ఘనంగా జరుపుకున్నారు. అక్కా, చెల్లి, అన్నా తమ్ములకు రాఖీలు కట్టి ప్రేమానురాలను గుర్తు చేసుకున్నారు. చేవెళ్లలో రాఖీ దుకాణాలు కిటకిట లాడాయి.