హైదరాబాద్

ఎక్కడెక్కడ అడ్డంకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: వినాయక చవితి సమీపిస్తుండటంతో నవరాత్రి ఉత్సవాలతో పాటు ఉత్సవాల్లో చివరి ఘట్టమైన నిమజ్జనం సైతం ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు కాస్త ముందు నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు వినాయక విగ్రహాలను బెంగుళూరులో మాదిరిగా ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్‌లతో ఏర్పాటు చేసిన కొలనుల్లో మాత్రమే నిమజ్జనం చేసేందుకు పది ఎన్‌క్లోజర్‌లను ఏర్పాటు చేసే పనులను ఇప్పటికే జిహెచ్‌ఎంసి ప్రారంభించింది. వచ్చే నెల 15వ తేదీ కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సైతం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక వినాయక చవితి ఉత్సవాల్లో అన్ని విభాగాల కన్నా అత్యంత కీలకమైన విధులు నిర్వర్తించే నగర పోలీసు శాఖ కూడా కాస్త ముందు నుంచే నిమజ్జనం ఏర్పాట్లపై దృష్టి సారించినట్టుంది.
ఇందులో భాగంగా పాతబస్తీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భారీ విగ్రహాలకు మెట్రో కారిడార్లు ఉన్న ప్రాంతాల్లో ఏమైనా అడ్డంకులెదురవుతున్నాయా? అన్న విషయాన్ని గుర్తించేందుకు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి రెండురోజుల క్రితం ఎం.జె.మార్కెట్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే! మెట్రోరైలు పనుల కారణంగా కారిడార్లు నిర్మించనున్న ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు పూర్తయినా, పలు చోట్ల భారీ సైజుల్లో మెట్రో స్టేషన్లు రావటం, మరికొన్ని చోట్ల కారిడార్ మలుపులు తిరగటంతో భారీ సైజు విగ్రహాలకు ఏమైన అడ్డంకులు తలెత్తుతున్నాయా? అన్న విషయాన్ని పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఒక వేళ పది అడుగులు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలకు ఎక్కడైనా అడ్డంకులు తలెత్తితే, అలాంటి విగ్రహాలను హుస్సేన్‌సాగర్ వరకు తీసుకువచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకునే అవకాశముంటుందనే పోలీసు శాఖ కాస్త ముందుగా ఈ పర్యటనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మెట్రోకారిడార్ ఎక్కువగా మలుపులు తిరిగే ప్రాంతాల్లో రోడ్లకిరువైపులా పడి ఉన్న డెబ్రీస్ వంటిని కాస్త ముందుగానే తొలగించాలని, అలాగే కారిడార్ నిర్మాణ పనులు పూర్తయిన ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వచ్చే వైపు రోడ్డుపై ఏర్పడిన గుంతలను నిమజ్జనానికి ముందుగా పూడి వేయాలని మెట్రోరైలు, జిహెచ్‌ఎంసి అధికారులను పోలీసులు కోరనున్నారు.
ఇదివరకు వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్ అప్పర్‌ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లలో ఏర్పాటు చేసే దాదాపు 32 క్రేన్ల ద్వారా నిమజ్జనం చేసేవారు. అయితే ఈ సారి వినాయక నిమజ్జనం, హుస్సేన్‌సాగర్ చెరువు పరిరక్షణకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు నిమజ్జనం నిమిత్తం హుస్సేన్‌సాగర్‌లోనే రెండు ప్రత్యేక నిమజ్జనం కొలనులను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇదివరకు 32 క్రేన్ల వద్ధకు వచ్చే విగ్రహాలను ఈ రెండు కొలనుల్లో మాత్రమే ఎలా నిమజ్జనం చేయాలి? అందుకు ప్రణాళికలెలా ఉండాలన్న విషయంపై సర్కారు, జిహెచ్‌ఎంసి, పోలీసు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.