హైదరాబాద్

క్షణ క్షణం..ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడి ఓడిన ‘సింధూ’రంహైదరాబాద్, చార్మినార్, ఆగస్టు 19: రియో గేమ్స్‌లో మొట్టమొదటి సారిగా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో స్వర్ణ పతకం కోసం సింధు హోరాహోరీగా పోరాడి ఓడింది. అయినా ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించింది. సింధు మ్యాచ్ తిలకించేందుకు మహానగరంలోని పలు క్రీడా సంస్థలు, అయిదు, మూడు నక్షత్రాల హోటళ్లతో పాటు పలు ఐటి సంస్థలు భారీ ఏర్పాటు చేశాయి. ఇళ్లలో, హోటళ్లలో, వ్యాపార సంస్థలతో పాటు ఐటి కంపెనీల్లో జనం మ్యాచ్ చూసేందుకు టీవిలకు అతుక్కుపోయారు.
సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ నివాసాల ముందు కూడా క్రీడాభిమానాల కోలాహలం నెలకొంది. సాయంత్రం ఏడు గంటల తర్వాత ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు నగరంలోని అన్ని టీవీ షో రూంల వద్ద క్రీడాభిమానాలు కిక్కిరిసిపోయారు.
మ్యాచ్ ప్రారంభమై, మూడు సెట్లుగా కొనసాగినంత సేపు నగరవాసుల క్షణక్షణం ఉత్కంఠగా మ్యాచ్‌ను తిలకించారు. మొదటి సెట్‌లో సింధు గెలుపు సాధించటంతో సింధు, పుల్లెల గోపీచంద్ నివాస ముందు కూడా వేడుక జరుపుకున్నారు. మొదటి సెట్‌లో ప్రత్యర్థిని ఖంగు తినిపించిన సింధు ఆధిక్యతను సాధించటంతో ఆమె ఖచ్చితంగా స్వర్ణ పతకం చేజిక్కించుకుంటుందన్న నమ్మకం పెరిగింది. కానీ షటిల్ బ్యాడ్మింటన్‌లో మొదటి ర్యాంకులో ఉన్న కరోలినా మారిన్ అనుభవం ఆమెకు కలిసొచ్చినా, మూడు సెట్లలో ఆమెను సింధు ముప్పు తిప్పలు పెట్టింది. చివరి సెట్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది.
కేవలం నగరంలోనే గాక, దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తితో తిలకించిన ఈ మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడినా, ఒలింపిక్స్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ పతకం మ్యాచ్ వరకు షటిల్ బ్యాడ్మింటన్‌ను తీసుకెళ్లిన మొట్టమొదటి భారత మహిళగా సింధు రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్‌లో షటిల్ బ్యాడ్మింటన్‌లో మన దేశానికి సిల్వర్ పతకాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి భారత మహిళగా సింధు అరుదైన రికార్డు సృష్టించటం పట్ల నగరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.