హైదరాబాద్

న్యాయం కోసం పోరాడితే రౌడీషీట్లు తెరుస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 22: ఉగ్రవాదులకు పెట్టే బి-షీట్లను తెలంగాణ ఉద్యమకారులపై పెట్టడం, న్యాయం కోసం పోరాడిన ఉద్యమ కారులపై రౌడీషీట్లు తెరవడం ఎంతవరకు సమంజసమని జెఎసి చైర్మన్ ఆచార్య కోదండరాం ప్రశ్నించారు. సోమవారం జెఎసి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న శుభప్రద్‌పటేల్‌పై బి-షీట్ తెరవడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో జైతెలంగాణ అని నినదించిన పాపానికి చంద్రకాంత్‌రెడ్డిని ఉద్యోగానికి దూరం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రకాంత్ ఉద్యోగం గురించి ప్రతి ఒక్కరికి వివరించామని ఉద్యోగం ఇస్తాము, ఇవ్వము అనే మాట చెప్పడంలేదని, ఉద్యోగానికి సంబంధించిన ఫైలు ఉద్యోగం ఇచ్చే వారి టేబుల్‌పై ఉందని ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీమని అన్నారు. రాజ్యాంగానికి లోబడే తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాలు చేపట్టామని గుర్తుచేశారు. 2009 డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణకు అనుకూలంగా ప్రకటనిచ్చిన కేంద్ర హోంమంత్రి చిదంబరం కేసులన్ని ఎత్తివేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. ఇతరత్రా కారణాలతో తెలంగాణ ఆలస్యమైనా మొత్తానికి సాధించుకున్నామని తెలిపారు. ఇప్పటికీ వికారాబాద్, ఇబ్రహీంపట్నంలో విద్యార్థులపై కేసులున్నాయని వాపోయారు. అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమ సమయంలో అడిగినపుడు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని అప్పటి హోంమంత్రి సబితారెడ్డిని అడ్డుకున్నందుకు, ర్యాలీలు నిర్వహించినందుకు నమోదైన కేసులు ఉద్యమకారులపై ఉన్నాయని వివరించారు.
రంగారెడ్డి జిల్లాకు రెండు నదుల నీరు కావాలి
రంగారెడ్డి జిల్లాకు కృష్ణా, మంజీర జలాలు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జిల్లాకు నీరు వస్తుందనే స్పష్టత రాలేదని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఎంత నీరు రావాలనే విషయంపై నిపుణులతో చర్చించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పదిరోజులుగా వర్షం కురియని కారణంగా పంటలు ఉంటాయో, ఎండిపోతాయోననే ఆగమ్యగోచర పరిస్థితిలో రైతులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి నీరు తేవాల్సిన అవసరముందని, నీటి విషయమై జెఎసి ఎన్నోసార్లు సమావేశమై చర్చించిందని గుర్తుచేశారు. నీటిరాక పథకం కోసంఆలోచిస్తుందని అన్నారు.
జెఎసి ప్రజల గొంతుక
జెఎసి రాజకీయ పార్టీ కాదని ఇది అన్ని సంఘాల కలయికతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిందని స్పష్టం చేశారు. చిన్న చిన్న పరిశ్రమలతో ఆదాయం పెరిగితే జిల్లా అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. జెఎసి విద్య, వైద్యం, వృత్తి, నీళ్ళ విషయంలో ఆలోచిస్తుందని, జెఎసికి విద్యార్థులు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రజల తరఫున మాట్లాడే గొంతుగా జెఎసి మాట్లాడుతుందని అన్నారు. గ్రామాల్లో రైతులను ఐక్యం చేసి హక్కుల సాధన కోసం పోరాటం చేసేలా సిద్దం చేయాలని సూచించారు. వెంటనే ఉద్యమకారుపై ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ శృతిఓఝా, జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్‌లకు వినతిపత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో జెఎసి రాష్ట్ర కోఆర్డినేటర్ పి.రవీందర్, విద్యార్థి జెఎసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుజిత్ మఠంలా, జిల్లా జెఎసి చైర్మన్ కె.శ్రీనివాస్, నియోజకవర్గ చైర్మన్ కల్కోడ నర్సింలు, తాండూర్ జెఎసి చైర్మన్ సోమశేఖర్, సీనియర్ న్యాయవాది పి.గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘాల నాయకుడు రాంరెడ్డి, పాండురంగం, వెంకటయ్య, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు