హైదరాబాద్

భవన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: మహానగర పాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగం అంటేనే అవినీతిలో కూరుకుపోయిందన్న అపవాదు. దానికి తోడు లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులెక్కువ మంది ఈ విభాగానికి చెందిన వారే. అంతేగాక, క్షేత్ర స్థాయిలో అక్రమ నిర్మాణాలను ప్రాథమిక దశలోనే నిలిపివేయాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ అధికారులపైనే ఉన్నా, అందినంత దండుకుని వాటికి అండగా నిలుస్తున్నారన్న ఆరోపణ ఉందని, దాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధుల మదిలో నుంచి తొలగించేలా విధులు నిర్వర్తించాలని కమిషనర్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం టౌన్‌ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే దిశగా సర్కారు కృషి చేస్తోందని, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి 3వేల 263 కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, మరో 142 కంటెప్ట్ కేసులు, 102 లోకాయుక్త కేసులు విచారణలో ఉన్నాయని వెల్లడించారు. వివాదాస్పద భవనాల క్రమబద్ధీకరణ గడువు ముగిసిన గత అక్టోబర్ 28వ తేదీ తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు వచ్చాయని, వీటిని తొలగించటంలో చేసిన నిర్లక్ష్యం పట్ల కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో 1997 పురాతన శిథిల భవనాలను గుర్తించగా, వాటిలో 927 భవనాలను కూల్చివేసినట్లు తెలిపరా. మరో 95 భవనాలకు మరమ్మతులను చేపట్టినట్టు పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా జిహెచ్‌ఎంసిలో అమలు చేస్తున్న ఆన్‌లైన్ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి 231 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పూర్త చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ డిపిఎంఎస్ ద్వారా అందే దరఖాస్తులకు అనుమతించే సమయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయి తనిఖీ చేసిన భవన నిర్మాణ అనుమతులు జారీలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
చిత్తశుద్ధితో పనిచేయాలి
టౌన్‌ప్లానింగ్ విభాగం పనితీరుపై ప్రజల్లో అనేక రకాల అపవాదులున్నాయని, వాటిని తొలగించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కమిషనర్ సమీక్షలో సూచించారు. కొత్త రాష్ట్రం, కొత్త పాలనలో నూతన దృక్పథంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వ హయాంలో తమ పనితీరును గణనీయంగా మెరుగుపర్చుకోవాలన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న ఆన్‌లైన్‌న అనుమతులు పొందే దరఖాస్తులను నిర్ణీత కాలంలో పరిష్కరించి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నగరంలో మేధావులు, విద్యావంతులు, నిత్యం ప్రజలతో సంబంధం కలిగి ఉన్నవారు అధిక సంఖ్యలో ఉన్నందున టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, అధికారులు మరింత నిజాయితీతో నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన అవసరముందని కమిషనర్ హితవు పలికారు.