హైదరాబాద్

గులాబీ బాసుకు జన నీరా‘జనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్రంలోని కోటి ఎకరాలను మాగాని చేయాలన్న సంకల్పంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పొరుగు రాష్టమ్రైన మహారాష్టత్రో పలు నీటిపారుదల ప్రాజెక్టుల ఒప్పందాలను చేసుకుని బుధవారం సాయంత్రం నగరానికి వచ్చిన సిఎం కెసిఆర్‌కు నగరవాసులు, వివిధ జిల్లాలకు చెందిన రైతుల నీరాజనం పలికారు. సిఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహరెడ్డి, మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాసయాదవ్, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపిలు బీబి పటేల్, బాల్కాసుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, తీగల కృష్ణారెడ్డి, మాగంటి గోపీనాథ్, జి.సాయన్న, బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, దివాకర్‌రావు, పల్లారాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరధ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, తెలంగాణ సంస్కృత సారధి అధ్యక్షులు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావులు సిఎంకు ఘనస్వాగతం పలికారు. చారిత్రక ఒప్పందం చేసుకుని వచ్చిన సిఎంకు ఘనంగా స్వాగతం పలికేందుకు నగరంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మెదక్, రంగారెడ్డి, నల్గొండ, అదిలాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి ఉదయం నుంచే భారీగా రైతులు తరలివచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులతో బేగంపేట ఎయిర్‌పోర్టు జనసంద్రమైంది. పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బేగంపేట పబ్లిక్ స్కూల్ నుంచి ఇటు రసూల్‌పురా చౌరస్తా వరకు పబ్లిక్ స్కూల్ మైదానంతో పాటు రోడ్డుకిరువైపులా ఉన్న పలు ఖాళీ స్థలాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతుల వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. సిఎం ఎయిర్‌పోర్టులో విమానం దిగినప్పటి నుంచి ఘనస్వాగతం, సిఎం ప్రసంగం కార్యక్రమాలు ముగిసే వరకు ఫ్లై ఓవర్‌ను వన్‌వే చేశారు. సుమారు రెండు వేల మంది కళాకారులు సిఎంకు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఈ స్వాగత కార్యక్రమం కొనసాగింది. సిఎం తన ప్రసంగంలో భాగంగా విపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేసినపుడల్లా కార్యకర్తల కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మోరుమోగింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం త్వరలోనే కాళేశ్వరం, రామదాసు, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చి రైతుల కలలు సాకారం కానున్నట్లు భరోసా కల్పిస్తూ కొనసాగిన ప్రసంగానికి అభినందలు వెల్లువెత్తాయి. స్వాగత కార్యక్రమం ముగిసిన తర్వాత సిఎం కెసిఆర్ తన కాన్వాయిలో వెళ్లిపోగా, ఆ తర్వాత మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సిఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి

హైదరాబాద్, ఆగస్టు 24: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న జలమండలి శివారు మున్సిపాల్టీల్లో నీటి సౌకర్యం కల్పించేందుకు దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌ను అనుకోని ఉన్న గ్రామాల్లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.1900 కోట్ల హడ్కో రుణాలతో పనులు చేపడుతోంది. జలమండలి ఎండి ఎం.దానకిశోర్ బుధవారం ఖైర్‌తాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో ప్రాజెక్టు విభాగానికి చెందిన డైరెక్టర్లు, సిజిఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగర శివారు గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కోసం జలమండలి ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను 2017 ఫిబ్రవరి మాసంలోపు పూర్తి చేయాలని ఎండి అధికారులను అదేశించారు. నీటి సౌకర్యం కల్పించని ప్రాంతాలేవైన ఉంటే, అందుకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్టును రూపోందించాలని ఎండి మెయింటనెన్స్, ప్రాజెక్టు విభాగంకు చెందిన జిఎం, మేనేజర్‌లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శివార్లలో నీటి సౌకర్యం కల్పించేందుకు ప్రాజెక్టులో చేపడుతున్న పనుల్లో భాగంగా నిర్మిస్తున్న 56 రిజర్వాయర్ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జలమండలి ఇడి ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, ఎం.ఎల్లస్వామితో పాటు పిసిసి-3 సిజిఎం డి.రామచంద్రరెడ్డి, ఆనంద్ స్వరూప్ పాల్గొన్నారు.