హైదరాబాద్

ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 24: ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జూన్ 16న కర్రపూజతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మొదట షెడ్‌ను నిర్మించిన అనంతరం మహాగణపతి ఏర్పాటుకు మూల స్థంభాన్ని ఏర్పాటు చేశారు. శిల్పి రాజేందర్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్, చెన్నై, మహారాష్ట్ర, కోల్‌కతాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది నైపుణ్యవంతులైన కళాకారులు శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్నారు. 58 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో గణపతిని తీర్చిదిద్దగా గణపతికి ఇరువైపులా శక్తిపీఠాల్లో మొదటిదైన శంకరీదేవి విగ్రహం కుడివైపు, ఎడమవైపు సరస్వతీ దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఏకదంతునికి వెనుక భాగంలో శివలింగం పుట్ట, పుట్టపైన ఆవులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు విడిగా విగ్రహానికి కుడివైపున చిలుకూరి బాలాజీ విగ్రహం, ఎడమవైపున గోవర్ధన గిరిలను అద్భుతంగా తీర్చిదిద్దారు. భారీ విగ్రహాలను తయారు చేసేందుకు సుమారు 24 టన్నుల ఇనుము, వెయ్యి బస్తాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 60 బండిల్స్ కొబ్బరి నార, 500 మీటర్ల గోనెసంచుల బస్తాలు, 600 బస్తాల బంక మట్టిని వినియోగించినట్టు శిల్పి రాజేందర్ తెలిపారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో మంగళవారం రాత్రి పెయింటింగ్ పనులను ప్రారంభించారు. పండగకు రెండు రోజుల ముందే ఆ పార్వతీతనయుని రూపాన్ని భక్తుల సందర్శనకు సిద్ధం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదంతా భగవంతుని
కృపాకటాక్షాల వల్లే..
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని తయారు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
మొదటి సారి 1978వ సంవత్సరంలో ఖైరతాబాద్ మహాగణపతి రూపాన్ని తయారు చేసే అవకాశం వచ్చింది. నా కుటుంబం అంతా ఎంతో సంతోషపడ్డాం. నిర్వాహకులు నా నైపుణ్యాన్ని మెచ్చి అనంతరం కూడా విగ్రహాన్ని తయారు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇలా 15 సంవత్సరాల పాటు 1992 వరకు విగ్రహాన్ని తయారు చేస్తూ వచ్చాను. కొన్ని అనివార్య కారణాలతో దూరమై 2000 సంవత్సరం నుంచి తిరిగి ఆ శంకర తనయుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నాను. ఏ ఏటికి ఆ ఏడు భక్తులకు మహాద్భుతమైన గణనాథుని రూపాన్ని చూపాలన్నదే నా తపన. నాతోపాటు మిగిలిన కళాకారులు ఎంతో భక్తిశ్రద్ధలతో విగ్రహాలను రూపొందిస్తారు. ఆ భగవంతుని కృపాకటాక్షాల వల్లే మేమీ పనులు చేయగలుగుతున్నాం. జీవించి ఉన్నంత వరకు విగ్రహాన్ని తయారు చేస్తా.

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై కసరత్తు

హైదరాబాద్, ఆగస్టు 24: వినాయక నిమజ్జనంపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభమైంది. గతానికి భినంనగా ఈసారి ఖైరతాబాద్ గణేశ్‌డిని ముందుగానే నిమజ్జనానికి తరలించాలని నిర్ణయంచారు. ఇప్పటి వరకు వినాయక నిమజ్జనం, విగ్రహాల ఏర్పాట్లుపై నెలకొన్న అనేక సందేహాలకు ప్రభుత్వం ఇటీవలే తెరదింపిన సంగతి తెలిసిందే. ప్రత్యేక కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని, విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించకుండా ఉండాలని ఇప్పటికే నిబంధన విధించింది. ఈ క్రమంలో వచ్చే నెల 15వ తేదీన ఒకే రోజు వినాయక నిమజ్జనం, బక్రీద్ పండుగలు రావటంతో ఏర్పాట్లపై అధికారులు కాస్త ముందు నుంచే దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ ఈస్ట్(రాచకొండ) కమిషనర్ మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ మాట్లాడుతూ ఒకే రోజు రెండు పండుగలు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, జిహెచ్‌ఎంసి, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందని అన్నారు. ఖైరతాబాద్ గణేశ్‌డుని పగటివేళలోనే నిమజ్జనానికి తరలిస్తే ట్రాఫిక్ అంతరానికి చెక్ పెట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. నగరంలోని ప్రతి సర్కిల్‌లో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వినాయకుడి మండపం వద్ధ పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వాహణ, ఇతర జాగ్రత్తలపై స్వచ్ఛ వాలంటీర్లను నియమించటం జరుగుతుందన్నారు. బక్రీద్ పండుగ రోజున వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగించేందుకు ప్రత్యేకంగా బ్యాగులను అందజేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి తరలివచ్చే విగ్రహాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గాను నగరంలోని రోడ్లపై ఏర్పడిన గుంతలన్నింటిని పూడ్చి వేయాలని కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే!
గోవుల అక్రమ రవాణాకు చెక్
బక్రీద్ సందర్భంగా గోవులను అక్రమంగా తరలిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచంచారు. నగరంలోకి గోవులను అక్రమంగా తీసుకురాకుండా నిరోధించేందుకు సైబరాబాద్ పరిధిలో 20, హైదరాబాద్ పరిధిలో 15 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గోవధ పేరుతో శాంతిభద్రతల పరిస్థితికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగంరలోకి వచ్చే జంతువుల వాహనాలకు సరైన ఆధారాలు ఉంటేనే అనుమతించటం జరుగుతుందని తెలిపరా. వినాయక విగ్రహాల నిజమ్జనం మూడవ రోజు నుంచి వరుసగా పదిరోజుల పాటు జరుగుతున్నందున ప్రతి ఒక్క విభాగం నిరంతరంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పండుగల నిర్వాహణలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణదే ప్రధాన పాత్ర అని పేర్కొన్నారు.

- శిల్పి రాజేందర్