హైదరాబాద్

మరీ ఇంత ధారాదత్తమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 25: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకొని దేశ కీర్తిని చాటిన సింధు విషయం వాట్సాప్‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశానికి పతకం తెచ్చిన సింధును అభినందిస్తూనే ప్రభుత్వాలు ప్రకటించిన భారీ నజరానాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏపి, తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలతో పాటు సంస్థలు భారీ నజరానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగుతేజం ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలుచుకోవడం అందరికీ గర్వకారణమే అందుకు సింధును అభినందించాల్సిందే, అదే సమయంలో ప్రభుత్వాలు పోటీపడి మరీ కోటాను కోట్ల రూపాయలను ధారాదత్తం చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకం అవసరమే ఆ స్థాయికి ఎదిగేందుకు వారు పడ్డ కష్టాలకు ప్రోత్సాహం ఇవ్వడం తప్పనిసరే, అదే సమయంలో ఈ స్థాయిలో ప్రజాధనాన్ని ప్రోత్సాహకంగా అందించడం సబబేనా అంటూ భారీ మెస్సేజ్‌లు పోస్టు చేస్తున్నారు. ఈ విషయంపై ఆసక్తికర పోస్టింగులు, మెస్సేజులు ఓ గ్రూప్ నుంచి మరో గ్రూప్‌కు చేరిపోతున్నాయి. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపి ప్రభుత్వం భవిష్యత్ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు ఈ సొమ్ములో కొంత కేటాయిస్తే బాగుండును అని, దేశానికి అన్నం పెట్టే రైతుల సమస్యలు తీర్చడానికి వినియోగిస్తే బాగుండునని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సింధు లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రత్యేక క్రీడావిధానం రూపొందించుకోవాలని, ఇందుకోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేస్తే బాగుంటుందని కొందరు సూచనలు చేస్తున్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా గతంలో పతకాలు గెల్చిన వారికి ప్రోత్సాహం లేకుండా వారెలాంటి దుస్థితిలో ఉన్నారో వివరించే పోస్టులు కూడా వాట్సాప్‌లో కన్పిస్తున్నాయి. వీటితో పాటు దేశానికి పేరు తెచ్చారు కాబట్టి కోట్లు ఇచ్చారు..! మంచిది మరి దేశానికి ప్రాణమే ఇచ్చేసిన సైనికులకు ఎవరెన్ని కోట్లు ఇచ్చారు..! ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగ్‌కు వందల సంఖ్యలో లైకులు వస్తుండగా పదుల సంఖ్యలో నెటిజన్లు షేరింగ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చల్లో సింహభాగం నెటిజన్లు మాత్రం అంతమొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ నజరానాలు ఇవ్వడం సమంజసం కాదని, ఇవ్వాలనుకుంటే వ్యక్తిగత, పార్టీ సొమ్ము ఇచ్చుకోండి అంటూ చురకలు వేస్తున్నారు.